Rajamouli Dream Project: బిగ్ న్యూస్.. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతంలో’ చెర్రీ, తారక్.. 

Rajamouli Dream Project: టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోస్ ఇంటర్వ్యూల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగానే రాజమౌళి తన బిగ్ డ్రీమ్ గురించి అనుకోకుండా రివీల్ చేసేశారు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘మహా భారతం’ అని రాజమౌళి చాలా కాలం నుంచి చెప్తున్న సంగతి అందరికీ విదితమే. […]

Written By: Mallesh, Updated On : December 28, 2021 6:20 pm

SS Rajamouli

Follow us on

Rajamouli Dream Project: టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోస్ ఇంటర్వ్యూల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగానే రాజమౌళి తన బిగ్ డ్రీమ్ గురించి అనుకోకుండా రివీల్ చేసేశారు.

Rajamouli Dream Project

తన డ్రీమ్ ప్రాజెక్టు ‘మహా భారతం’ అని రాజమౌళి చాలా కాలం నుంచి చెప్తున్న సంగతి అందరికీ విదితమే. అయితే, ఆ పిక్చర్ ఎప్పుడు తెరకెక్కిస్తారనేది మాత్రం ఇప్పుడే చెప్పలేనని, తనకు ఇంకా అంత అనుభవం రాలేదని, అది వచ్చాకనే తాను ఈ సినిమా చేస్తానని, బహుశా పదేళ్లు పట్టొచ్చని వివరించాడు. ఇకపోతే ఆ చిత్రంలో నటీనటుల గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులందరినీ అందులో భాగం చేస్తారని టాక్ ఉంది. కాగా, తాజాగా ఆ చిత్రంలో ‘ఆర్ఆర్ఆర్’ హీరోలిద్దరూ బుక్ అయినట్లు చెప్పకనే చెప్పేశారు రాజమౌళి.

Also  Read: ‘దర్శకులందు రాజమౌళి లెస్స’.. జక్కన్న పై ప్రశంసల వర్షం

‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో చెర్రీ, తారక్ ఇద్దరూ కలిసి తమకు ‘మహాభారతం’లో అవకాశం ఇస్తారా అని అడిగారు. ఆ ప్రశ్నకు రాజమౌళి బదులు ఇచ్చారు. వాళ్లిద్దరూ ఆ మూవీలో ఉంటారని పేర్కొన్నాడు. అయితే, వారి పాత్రలేంటనేది మాత్రం చెప్పలేదు. అయితే, తాను తీయబోయే మహాభారతంలో ఇప్పటిదాకా అందరూ చదువుకున్నట్లు సినిమా ఉండబోదని అన్నాడు. ఆయా పాత్రలను, పాత్రలకు, పాత్రలకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిధిని మించి తనదైన శైలిలో చూపాలన్నది తన ఉద్దేశమని జక్కన్న వివరించాడు.

మొత్తంగా విజ్యువల్ వండర్‌లాగా మహా భారతం సినిమా ఉండాలని తాను భావిస్తున్నట్లు జక్కన్న పేర్కొన్నాడు. మహేశ్ బాబుతో చేయబోయే సినిమా తర్వాతనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. చూడాలి మరి.. మహాభారతం సినిమాకు రాజమౌళి ఎంత టైం తీసుకుంటారో.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కొమురం భీంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషించారు. ఇక చెర్రీకి జోడీగా ఆలియా భట్, తారక్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా నటించింది.

Also  Read: మహేష్-రాజమౌళి కాంబోపై ఎన్టీఆర్, చరణ్ సెటైర్లు..!

Tags