https://oktelugu.com/

Sukumar: సుకుమార్​ గురించి మాట్లాడుతూ.. స్టేజ్​పైనే కంటనీరు పెట్టుకున్న బన్నీ

Sukumar: సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప ఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ పుష్ప అంటే ఫైర్ అన్నట్లు ప్రేక్షకుల్లో సినిమా నిలిచిపోయింది. అల్లు అర్జున్ కెరీర్​లోనే భారీ కలెక్షన్లు రాబడుతోన్న సినిమా ఇదే కావడం విశేషం.  కాగా, తాజాగా, ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా థాంక్యూ మీట్​ను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్​ అయిపోయాడు. ఎప్పుడూ లేని విధంగా స్టేజిపైనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 07:29 PM IST
    Follow us on

    Sukumar: సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప ఎంత ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ పుష్ప అంటే ఫైర్ అన్నట్లు ప్రేక్షకుల్లో సినిమా నిలిచిపోయింది. అల్లు అర్జున్ కెరీర్​లోనే భారీ కలెక్షన్లు రాబడుతోన్న సినిమా ఇదే కావడం విశేషం.  కాగా, తాజాగా, ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా థాంక్యూ మీట్​ను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్​ అయిపోయాడు. ఎప్పుడూ లేని విధంగా స్టేజిపైనే ఏడ్చేశాడు.

    ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రతి సారి అందరికీ థ్యాంక్స్ చెప్పడం అలవాటే అని అందరూ అనుకుంటారు. కానీస అది మీకు నచ్చకపోయినా మా బాధ్యత. అని చెప్పుకొచ్చారు. రష్మిక గురంచి స్పందిస్తూ.. మనసుకు బాగా కనెెక్ట్​ అయిన అతి తక్కువ మందిలో తను ఒకరని.. కొన్ని సీన్స్​లో ఆమె సహకారం లేకపోతే.. అసలు కంఫర్ట్​గా చేయలోకపోయేవాడినని అన్నారు.

    ఇక సమంత గురించి మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఈ సాంగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్​.. అంటూ చివరగా సుకుమార్ గురించి చెప్తూ ఎమోషనల్​ అయ్యారు బన్నీ. ఆర్య నుంచి పుష్ప వరకు వాళ్ల మధ్య ఉన్న బంధం గురించి గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. నా జీవితంలో రుణపడి ఉన్నాననే మాట కొంతమందికే ఉపయోగిస్తా. నా తల్లిదండ్రులు, మా తాతగారి తర్వాత.. కెరీర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ గా నిలిచిన చిరంజీవి గారికి. ఇప్పుడు సుకుమార్​ గారికి కూడా. డార్లింగ్ నువ్వు లేకపోతే నేను ఇక్కడ లేను.. నాకు ఇంకేం లేదు.. అని చెప్పుకొచ్చారు.