Tollywood Young Hero: భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ.. భర్తగ మారకు బ్యాచిలరూ అన్నారో సినీకవి. వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్నారు మరో కవి. పెళ్లి గురించి ఎన్నో విధాలుగా చెప్పినా సృష్టిలో అన్ని ప్రాణుల వలె మనుషులు కూడా ఒక్కటైతేనే కదా సృష్టి కార్యం జరిగేది. మానవ పుట్టుకకు బీజం పడేది. కానీ కొందరు మాత్రం వివాహం వద్దంటూ పేచీ పెడతారు. జీవితాంతం బ్రహ్మచారులుగానే ఉండిపోతారు. తమ జీవితంలో పెళ్లి అనే తంతు వద్దనే అంటారు. కానీ ఆ మధ్య పెళ్లి చేసుకుని ఒక్కటైన ఓ సినిమా జంట విడాకులు తీసుకుని విడిపోవడం గమనార్హం.
సినీ వారసత్వంగా వచ్చిన అతడు తన కెరీర్ ను సుస్థిరం చేసుకున్నాడు. తనతో నటించిన హీరోయిన్ నే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారి సంసారం మూడు ముద్దులు ఆరు కౌగిలింతలుగా సాగినా తరువాత కాలంలో ఏమైందో ఏమో కానీ వారిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. దీంతో ఇద్దరు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం బాధ పడ్డారు. తమ బిడ్డలు విడిపోవడానికి గల కారణాలు అన్వేషించారు. సర్దిచెప్పాలని చూశారు. అటు వైపు ఇటు వైపు ప్రయత్నాలు గట్టిగానే చేశారు. కానీ వారే ససేమిరా కలిసేది లేదని తెగేసి చెబుతున్నారు.
Also Read: Dil Raju: F3లో పవన్ కళ్యాణ్.. ఇదీ అసలు కిక్కంటే.. ఇక రచ్చ రచ్చే
దీంతో కారణాలేవైనా అర్థంతరంగా విడిపోవడం మంచిది కాదనే అభిప్రాయాలు అందరిలో వస్తున్నాయి. వారు మాత్రం తమ పంతం వీడటం లేదు. ఆమె సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా అతడు సైతం తనదైన శైలిలో విభిన్న కథాంశాలున్న సినిమాలు ఎంచుకుని తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ హీరోకు చాలా మంది హీరోయిన్లు సైట్ కొడుతున్నారు. సహజీవనం చేద్దామని కూడా ఆఫర్ ఇస్తున్నారు. అయినా అతడు లొంగడం లేదు. బ్యాచిలర్ లైఫే బాగుందని చెబుతున్నాడు.
ఆడదాన్ని కట్టుకుంటే అన్ని కష్టాలే అన వేదాంతంలోకి వెళ్లిపోయాడు. ఆమె కూడా మరో వివాహం చేసుకోవాలనే ప్రతిపాదన తేవడం లేదు. దీంతో ఇద్దరు మోడు వారిన చెట్లలా ఉండిపోతున్నారు. తమ భవిష్యత్ ఏమిటనే ప్రశ్న వారిలో రావడం లేదు. ఉన్నన్ని రోజులు ఇలాగే ఉంటాం అనే కోణంలో మాట్లాడుతున్నారు. అతడికి ఎన్ని ఆఫర్లు వచ్చినా తనదైన శైలిలో సున్నితంగా తిరస్కరిస్తున్నాడు. వివాహబంధంలోని మజాను వారు ఎంజాయ్ చేయలేదని తెలుస్తోంది. అందుకే విడాకులు తీసుకుని వేరై పోయినట్లు తెలుస్తోంది.
ఒక ఒంటరిగా ఉండాలనే ఇద్దరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల చొరవతోనైనా కలుస్తారేమోనని అనుకున్నా అది కూడా కుదరలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. సంసారమనే నావను సజావుగా నడిపే సత్తా లేకే ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి వారెవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది కదూ. రాబోయే కాలంలో వారు మళ్లీ కలుసుకుని సంసారం చేయాలని అందరు ఆశిస్తున్నారు.
Also Read:Varun Tej: ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – ఎఫ్ 3 నవ్వుల పండగలా వుంటుంది.
Recommended Videos
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Young hero avoid dating with heroines after divorce
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com