North Korea: ప్రపంచంలో ప్రధానంగా ఏడు వింతలుంటే…ఎనిమిదో వింత బహుశా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆ దేశంలో పెట్టే ఆంక్షలు,నిబంధనలు అలా ఉంటయ్ మరీ..! అందుకే కిమ్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారుతుంటాయి. కిమ్ ప్రజల వ్యక్తిగత విషయాలను విశేషంగా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటుండడం సంచలనంగా మారుతోంది. గతంలో ఈయన ఉత్తర కొరియా ప్రజల దుస్తుల ధరింపు,హెయిర్ స్టైల్‌పైన ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియాలో అక్కడి ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో దుస్తువులను ధరించాల్సి ఉంటుంది. కిమ్ ఆదేశాల మేరకే అక్కడి పౌరులు హెయిర్ స్టైల్ ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
వాస్తవానికి ఉత్తర కొరియా కమ్యూనిస్టు నియంత ఆధీనంలో ఉన్న దేశం. దీంతో పాశ్చాత్య,పశ్చిమ దేశాల ప్రభావం ఉత్తర కొరియా మీద పడకుండా కింగ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ దేశాల కల్చర్ ను ఉత్తర కొరియా ప్రజలు అనుసరిస్తే ఎక్కడ తన అధికారానికి ఎసరు వస్తుందోననే బెంగ ఆయనకు మొదటి నుంచి ఉంది. అందుకే ప్రజల వ్యక్తిగత జీవశైలిపై కూడా ఆంక్షలు పెట్టడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు. అందులో భాగంగానే కిమ్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ మొదలైంది. రెడ్ లిప్ స్టిక్ పై కిమ్ బ్యాన్ విధించారు. ఇది పూర్తిగా పశ్చిమ,పాశ్చాత్య దేశాల కల్చరని ప్రకటించారు. రెడ్ లిప్ స్టిక్ వాడకం వల్ల పశ్చిమ దేశాల ప్రభావం దేశ ప్రజలపై గణనీయంగా ఉంటుందనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించుకున్నారు. అందువల్లే ఇక నుంచి ఉత్తర కొరియా వ్యాప్తంగా ఏ మహిళ అయినా రెడ్ లిప్ స్టిక్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అయితే ఎంత కమ్యూనిస్టు దేశమైన రాచరికం,పాశవికాన్ని గుర్తు చేసేలా ఇంతటి దారుణమైన ఆంక్షలేంటని ప్రపంప వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కిమ్ మహిళల వ్యక్తిగత మేకప్‌పై కూడా ఆంక్షలు పెట్టారు. మహిళలు మేకప్ వేసుకుంటే పశ్చిమ దేశాల కల్చర్ ఎక్కువై దేశ సామాజిక పరిస్థితుల్లో పెను మార్పులు సంభవించొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో కిమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై వరల్డ్ వైడ్ గా పెద్ద దుమారమే కొనసాగింది. ఈనేపథ్యంలోనే కిమ్ జోంగ్ రెడ్ లిప్ స్టిక్ పై తీసుకున్న నిర్ణయంపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పేరుకు కమ్యూనిస్టు దేశం,సమ సమాజ సిద్ధాంతమని చెప్పుకునే ఉత్తర కొరియాలో ఏంటీ ఈ ఆంక్షలంటూ..ప్రపంచ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదెక్కడి దిక్కుమాలిన రూల్స్…కిమ్‌కు ఇదే మాయం రోగం అంటూ తిట్టిపోస్తున్నారు