Shortest International Bridge: నదులు, కాలువలు, సముద్రాలు.. పట్టణాలను, జిల్లాలను, రాష్ట్రాలు, దేశాలను వేరు చేస్తుంటాయి. పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల మధ్య సంబంధాల కోసం ప్రభుత్వాలు వారధి(వంతెనలు) నిర్మిస్తుంటాయి. పొరుగు ప్రాంతాలతో సత్సంబంధాలకు ఈ వారధులు దోహదపడతాయి. రెండు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయి. ఈ భూమండలంపై మూడు వంతుల నీరే ఉండడంతో సముద్ర జాలాలు చాలా వరకు దేవాలను వేరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా దేశాలను వారధులు కలుపుతున్నాయి. ఇలా కలుపుతున్న ఓ చిన్న వంతెన పెద్ద రికార్డు సృష్టించింది. ఇంతకీ అది ఎక్కడ ఉంది.. పొడవు ఎంత.. రికార్డుకు కారణం ఏంటో తెలుసుకుందాం.
32 అడుగులే..
రికార్డు సృష్టించిన ఈ వంతెన పొడవు కేవలంం 32 అడుగులు. రికార్డు ఎంతుకంటే ఈ చిన్న వంతెన కలుపుతున్నది రెండు గ్రామాలను.. రెండు జిల్లాలను కాదు.. రెండు దేశాలను. అలా అని రెండు చిన్న దేశాలను కాదు.. అగ్ర రాజ్యం అమెరికా, మరో దేశం కెనడాను కలుపుతుంది. అనేక ప్రత్యేలు ఈ వంతెన సొంతం.
ఐల్యాండుల మధ్య..
అమెరికాలోని న్యూయార్క్ తీర ప్రాంతం నుంచి కెనడాలోని ఒంటారియో తీర ప్రాంతం వరకు వందల సంఖ్యలో ఐల్యాండ్‌లు ఉన్నాయి. ఈ ఐల్యాండుల్లో కొన్ని కెనడా అధీనంలో ఉండగా, అమెరికా అధీనంలో కొన్ని ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఐల్యాండ్‌లను కలుపుతూ వంతెనలు నిర్మించారు. ఇలా నిర్మించిన వంతెనల్లో ఆమెరికా అధీనంలో ఉన్న జవికాన్ ఐలాండ్ కు కెనడాలోని మరో ఐల్యాండ్ మధ్య నిర్మించిన 32 అడుగుల వంతెన అంతర్జాతీయగా అతి చిన్న వంతెనగా గుర్తింపు పొందింది.