Homeఅంతర్జాతీయంBahrain action against Pakistan Bangladesh nationals: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు బహ్రెయిన్‌ షాక్‌.. దేశ వ్యతిరేక...

Bahrain action against Pakistan Bangladesh nationals: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు బహ్రెయిన్‌ షాక్‌.. దేశ వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు!

Bahrain action against Pakistan Bangladesh nationals: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత విమానాల కూలిపోవడంపై మన దేశంలోని విపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడాయి. మన సైనికులను బలహీనపరిచే వ్యాఖ్యలు చేశాయి. మన విమానాలు కూలినట్లు వెల్లడించాయి. మోదీ ఏమీ చేయలేకపోతున్నారు అని విమర్శించాయి. అయినా కేంద్రం ఇలాంటివారిపై చర్య తీసుకోలేదు. శాంతియుతంగా వ్యవహరించింది. కానీ, బహ్రెయిన్‌ భారత్‌లా ఓపిక పట్టలేదు. శాంతియుతంగా వ్యవహరింలేదు. బహ్రెయిన్‌పై ఇరాన్‌ దాడులను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన పాకిస్తానీలు, బంగ్లాదేశ్‌ యువకుడిని అరెస్ట్‌ చేసింది.

బహ్రెయిన్‌ కఠిన చర్యలు..
ఇరాన్‌ దాడుల్లో బహ్రెయిన్‌కు జరిగిన నష్టాన్ని చూపించే వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన మహ్మద్‌ మువాజ్‌ అక్బర్, అఫ్జల్‌ఖాన్, అహ్మద్‌ ముంతాజ్, అస్సన్‌ అలీ సజ్జాదీ (పాకిస్తానీలు), మహ్మద్‌ ఇస్రఫిల్‌ మీర్‌ (బంగ్లాదేశీ)ను సైబర్‌ సెల్‌ ఐపీల ఆధారంగా అరెస్ట్‌ చేసింది. వారు బహ్రెయిన్‌లో ఉద్యోగాలు చేస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టారని నిర్ధారించింది. గల్ఫ్‌ దేశాల సాధారణ నియమాల ప్రకారం ఇలాంటి చర్యలు తీవ్రమైనవి.

Also Read: భారత్ కు అండగా రష్యా.. అమెరికా కు షాక్

రెండు దేశాల వ్యత్యాసం
భారత్‌ శాంతిమంత్రం పాటిస్తే.. బహ్రెయిన్‌ రాజ్యాంగ నియంత్రణలో గల్ఫ్‌ రాజ్యాల్లాగా తక్షణ అరెస్టులు, జైలు శిక్షలు విధించి జాతీయ భద్రతను కాపాడుకుంది. ఇది దేశ దృక్పథాల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి ప్రచారాలు యుద్ధ సమయంలో సోషల్‌ మీడియా దుర్వినియోగాన్ని చూపిస్తాయి, భారత్‌ డిజిటల్‌ రక్షణను మరింత బలోపేతం చేయాలి. బహ్రెయిన్‌ చర్యలు విదేశీ శ్రామికులకు హెచ్చరికగా మారాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version