https://oktelugu.com/

తక్కువ బడ్జెట్ లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..

మారుతి నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ 1.23 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 80.46 బీహెచ్ పీ పవర్, 11.7 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ ను 6.49 ప్రారంభ ధర నుంచి రూ.9.88 లక్షల వరకు విక్రయిస్తుంది. ఈ కారు 24 నుంచి 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2024 / 09:36 AM IST

    High Millage Car

    Follow us on

    కారు కొనాలనుకునేవారు లో బడ్జెట్ లో ఉండాలనుకుంటారు. కానీ ఇదే సమయంలో మైలేజ్ ఇచ్చే కారు కోసం కూడా చూస్తారు. అయితే తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇచ్చే కారు ఇచ్చే మార్కెట్లో ఉన్నాయి. రూ. 7 లక్షల బడ్జెట్ లో 25 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కారు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మారుతితో పాటు వివిధ కంపెనీలకు చెందిన కొన్ని కార్లు వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. ఆ కార్ల వివరాలు ఉన్నాయి.

    మారుతి నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ 1.23 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 80.46 బీహెచ్ పీ పవర్, 11.7 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ ను 6.49 ప్రారంభ ధర నుంచి రూ.9.88 లక్షల వరకు విక్రయిస్తుంది. ఈ కారు 24 నుంచి 25 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 ను రూ. 5.91 నుంచి 8.66 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది 17 నుంచి 24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    మారుతికి గట్టి పోటీ ఇస్తోంది టాటా కంపెనీ. ఈ కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ రూ.6.64 లక్షల నుంచి రూ.10.79 లక్షల వరకు విక్రయిస్తున్నారు. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 86.80 బీహెచ్ పీ పవర్ తో పాటు 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 19.14 నుంచి 26.2 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. సిట్రోయెన్ కంపెనీ నుంచి సి 3 కారు రూ.6.16 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.9.23 లక్షల వరకు విక్రయిస్తుంది.

    హ్యుందాయ్ ఏ 20 హ్యాచ్ బ్యాక్ నుంచి రూ.7.04 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.11.20 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు81.86 బీహెచ్ పీ పవర్ తో పాటు 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 15 నుంచి 17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టయోటా కంపెనీకి చెందిన గ్లాన్జా హ్యాచ్ బ్యాక్ కారు రూ.6.86 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.9.99 లక్షల వరకు విక్రయిస్తుంది. ఈ కారు మైలేజ్ 22.3 నుంచి 30.61 వరకు మైలేజ్ ఇస్తుంది.