Russia slams America: రష్యా నుంచి భారత్ నాలుగేళ్లుగా భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఇటీవలే అమెరికా భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ సదర్భంగా రష్యా నుంచి ఆయిల్ దిగుతి తగ్గించాలని సూచించింది. దీంతో భారత్ కూడా రష్యా ఆయిల్ తగ్గింపునకు చర్యలు తీసుకుంది. అయితే తాజాగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా ఆయిల్ దిగుమతి పెంచింది. మరోవైపు యూరప్‌కు చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రష్యా నుంచి అదనపు ఆయిల్ దిగుమతి చేసుకునరి యూరప్ దేశాలకు సరఫరా చేయాలని అమెరికా భారత్‌ను ప్రాధేయపడింది. కానీ, దానిని కప్పిపుచ్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ తామే భారత్‌కు రష్యా ఆయిల్ దిగుమతికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. దీంతో భారత్‌లో విపక్షాలు నానా యాగీ చేశాయి. ఇక ట్రంప్ ప్రకటనపై తాజాగా రష్యా రాయబారి అలిపోవ్ కూడా స్పందించింది.
ఎవరి అనుమతి అవసరం లేదు..
రష్యా రాయబారి మాట్లాడుతూ ‘మా నుంచి చమురు కొనేందుకు భారత్‌కు ఎవరి అనుమతి కూడా అవసరం లేదు‘ అంటూ అలిపోవ్ స్పష్టం చేశారు. అమెరికా తన ‘అసలు రంగు‘ చూపిందని, ఇతర దేశాలను తక్కువ స్థాయిలో చూస్తోందని ఆరోపించారు. ఇది భారత్ ఆర్థిక స్వాతంత్య్రాన్ని గౌరవించడం లేదని సూచించారు.
Also Read: ఫలించిన జైశంకర్ చర్చలు.. భారత్‌కు బిగ్ రిలీఫ్..!
అనుమతులపై ఆధారపడలేదు..
మరోవైపు భారత్ ‘జాతీయ ఆసక్తి ప్రకారం కొంటాము‘ అని పేర్కొంది. ‘ఎప్పుడూ అనుమతులపై ఆధారపడలేదు‘ అని స్పష్టం చేసింది. రష్యా నుంచి ఫిబ్రవరి 2026లో కూడా 20 శాతం ఆయిల్ దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. హార్ముజ్ మార్గం ద్వారా 40 శాతం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం, 250 మిలియన్ బ్యారెళ్ల బఫర్ స్టాక్ ఉందని అధికారులు తెలిపారు.
వ్యూహాత్మక ప్రాముఖ్యత
ఈ సంఘటన భారత్ రష్యాతో దీర్ఘకాలిక బంధాలను బలపరుస్తుంది. అమెరికా ఒత్తిడి ఉన్నా, జాతీయ ఆసక్తి పై ప్రాధాన్యత ఇచ్చి స్వాతంత్య్రం చాటుకుంది. ఇది గ్లోబల్ ఎనర్జీ రాజకీయాల్లో మన పొజిషన్‌ను బలోపేతం చేస్తుంది. రష్యా మద్దతుతో భారత్ చమురు సరఫరా స్థిరంగా ఉంటుంది.