What a miracle: కొన్నిసార్లు అద్భతాలు జరుగుతాయి. ఊహకందని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. నమ్మశక్యం కాకుండా ఉంటాయి. నిజంగానా అని నోరెళ్లబెట్టడం ఖాయం. అలా మనకు ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటుంటాయి. ఒక్కోసారి ఎవరైనా చెప్పినా నమ్మం. అంతా బూటకమని కొట్టి పారేస్తుంటాం. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనం ఊహించినట్లుగా ఉండవు. మన ఊహలకు అందవు. నిజంగా అలా జరిగిందా అని ఆరా తీస్తాం. కానీ మనం నమ్మలేకుండా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోయేది కూడా అలాంటిదే. వండర్ క్రియేట్ చేసింది.

ఏం జరిగింది?
ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా? ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. వేలాది మందిని నిరాశ్రయుల్ని చేసింది. ఎంతో మంది బంధువులను తమ కన్న వారిని చూసుకోనివ్వకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చెప్పుకునేది ఓ గుర్రం. శిథిలాల కింద ఓ గుర్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వారాల పాటు బతికి బట్టకట్టింది. దానికి అన్నం, నీళ్లు లేకపోయినా అన్ని రోజుల పాటు జీవించి ఉండటమే ఆశ్చర్యం కలిగించింది.
అదియామాన్ ప్రాంతంలో..
అదియామాన్ అనే ప్రాంతంలో శిథిలాలు తొలగిస్తుండగా ఓ గుర్రం అరుపులు వినిపించాయి. దీంతో రెస్క్యూ టీం జాగ్రత్తగా శితిలాలు తొలగిస్తుండగా గుర్రం వారి కంటబడటంతో అవాక్కయ్యారు. దాదాపు భూకంపం వచ్చి 21 రోజులైనా ప్రాణాలతో నిలవడం సంచలనం కలిగించింది. మూడు వారాల పాటు ఆహారం లేకుండా ఎలా జీవించిందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీన్ని వీడియో తీసి ప్రసార మాధ్యమాల్లో పెట్టడంతో లక్షలుగా లైకులు వస్తున్నాయి. గుర్రానికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
టర్కీ, సిరియాల్లో..
టర్కీ, సిరియాలను భూకంపం వణికించింది. దాదాపు 1.70 లక్షల భవనాలు నేలమట్టమయ్యాయి. వాటి కింద ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. వందేళ్ల తరువాత మళ్లీ అంత పెద్ద స్థాయిలో భూకంపం సంభవించింది. ఎందరో నిరాశ్రయులయ్యారు. తమ కన్న వారి కోసం ఎంత ప్రయత్నించినా ఆచూకీ లభించని వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ గుర్రం మాత్రం శిథిలాల కింద 21 రోజుల పాటు సజీవంగా ఉండటమే సంశయం కలిగిస్తోంది. దాని ఆయుష్షు రేఖ గట్టిగా ఉన్నట్లుంది. అంత పెద్ద భూకంపం ధాటికి కూడా అది ప్రాణాలతో నిలవడమే గమనార్హం. సంకల్ప బలం ఉంటే దేన్నయినా సాధించవచ్చంటారు కానీ ఎన్ని రోజులైనా జీవించవచ్చని ఆ గుర్రాన్ని చూస్తేనే అర్థమవుతుంది.