Kodali Nani and Vallabhaneni Vamsi: ఏపీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జగన్ ప్రత్యర్థో కాదో తెలియదు కానీ.. ఆ ఇద్దరు నేతలు మాత్రం బద్ధ విరోధులుగా మారిపోయారు. వారు ఏ పార్టీలో ఎదిగారో.. అదే పార్టీని విమర్శలు చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధినేతను, ఆయన కుటుంబాన్ని, పార్టీలోని కీలక నాయకులను టార్గెట్ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. వారు వాడుతున్న భాషపై కుతకుత ఉడికిపోతున్నారు. ఆ ఇద్దరు నేతలే కొడాలి నాని, వల్లభనేని వంశీ. అందులో నాని ఫుల్ మాస్ వాయిస్ వినిపిస్తుండగా.. వంశీ మాత్రం పంచ్ డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వారు చంద్రబాబు, లోకేష్ లనే నిత్యం టార్గెట్ చేస్తుంటారు. అయితే వారి కామెంట్స్ వైసీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ కు వినోదం పంచుతున్నాయి. ఆనందాన్ని నింపుతున్నాయి. మిగతా వైసీపీ నేతలకు పనిలేకుండా వారిద్దరే చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతుండడంతో మిగతా నేతలకు పనిల లేకుండా పోతోంది.

అయితే ఆ ఇద్దరు నాయకులు మంచి స్నేహితులు. కొడాలి నానితో ఉన్న స్నేహంతోనే వంశీ ఫ్యాన్ గూటికి చేరారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులుగా ముద్రపడ్డారు. పైగా టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారని బాధపడి బయటకు వచ్చారు. లోకేష్ పెత్తనాన్ని సహించలేక పార్టీకి దూరమైనట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ చీమ చిటుక్కుమన్నా వారు చంద్రబాబు, లోకేష్ లనే టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ ముందున్న టాస్క్ మాత్రం వల్లభనేని వంశీని రాజకీయంగా చెక్ చెప్పడం. ప్రస్తుతం ఆ పార్టీ ఎక్కువగా వంశీపైనే దృష్టిపెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గన్నవరంలో వంశీని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. అక్కడ పార్టీకి క్షేత్రస్తాయిలో బలంతో పాటు కమ్మ సామాజికవర్గం, ఆపై వంశీ రాజకీయ ప్రత్యర్థుల సహకారంతో చెక్ చెప్పొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. దాని పర్యవసానమే మొన్నటి ఎపిసోడ్. గట్టిగా వాయిసున్న నేతను గన్నవరం పంపిస్తే వంశీ చాప్టర్ క్లోజ్ చేయాలని భావించారు. పట్టాభిని పంపించాలని డిసైడ్ అయ్యారు. దీనిని గమనించిన వంశీ ముందుగానే తన దెబ్బ చూపించారు.
కొడాలి నాని మాస్ వాయిస్ వినిపించే క్రమంలో బూతులు మాట్లాడేస్తుంటారు. కానీ వంశీ విషయంలో అలా కాదు. ఎదుటి వాడిలో ఆలోచింపజేసే రీతిలో వంశీ మాటలుంటాయి. తటస్థులను సైతం ఆకర్షించి ఇది నిజమే కదా అని చెప్పించేలా కామెంట్స్ సాగుతాయి. ముఖ్యంగా వైసీపీ తటస్థులకు రాని చాలా ఆలోచనలు వంశీ తన మాటల ద్వారా ఉప్పందిస్తుంటారు. మాటలు అనేవాడి కంటే వాటిప్రభావం చాటే వారు అధిక ప్రమాదకరం. అందుకే చంద్రబాబు వంశీపై కాన్సంట్రేట్ చేశారు. అయితే కొడాలి నానిపై ఇప్పటికే ఒకరకమైన అపవాదు ఏర్పడింది. కేవలం వైసీపీ అంటే అభిమానించే వారు మాత్రమే నాని మాటలను ఆదరిస్తున్నారు. మిగతా వారు వ్యతిరేకిస్తున్నారు. కానీ వంశీ మాత్రం ఆడే మాటల్లో పాయింట్, లాజిక్ బయటపెడుతున్నారు. వాతపెట్టగలరు.. వెన్న రాయగలరు అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు. అందుకే ప్రమాదకరిగా భావిస్తున్న వంశీని తెగ్గొట్టాలన్న ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఉంది.