Hyper Aadi: హైపర్ ఆది బుల్లితెర మీద మహా వృక్షంగా ఎదిగాడు. అదిరే అభి టీంలో ఒక మెంబర్ గా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తన టాలెంట్ తో టీం లీడర్ అయ్యాడు. అక్కడ సూపర్ సక్సెస్ కావడంతో మెల్లగా ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ నుండి హైపర్ ఆది తప్పుకున్నట్లు సమాచారం. అయితే మల్లెమాల సంస్థకు చెందిన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కొనసాగుతున్నాడు. తాజాగా ఢీ 15 మొదలైంది. యాంకర్ ప్రదీప్ తో పాటు హైపర్ ఆది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో నడుపుతున్నారు.

తాజా ఎపిసోడ్ కోసం హైపర్ ఆది హిలేరియస్ స్కిట్ చేశాడు. ఆయన పోకిరి మూవీ స్పూఫ్ చేశాడు. ఈ క్రమంలో పండుగాడిగా మహేష్ యాటిట్యూడ్ చూపించాడు. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తా అంటూ పంచ్ డైలాగ్స్ కొట్టాడు. ‘మా సెట్ కి వచ్చి మా స్టేజ్ మీదే వార్నింగ్ లు ఇస్తున్నాడు…’ అని ప్రదీప్ అన్నాడు. దానికి సమాధానంగా ఆది ‘నువ్వు డబ్బులివ్వు జడ్జెస్ టేబులెక్కి డాన్స్ చేస్తా’ అని పంచ్ డైలాగ్ కొట్టాడు. ఇక ఈ పోకిరి స్పూఫ్ స్కిట్ లో ఒక పాత్ర చేసిన బిగ్ బాస్ జెస్సీ మీద నాన్ స్టాప్ పంచులతో హైపర్ ఆది విరుచుకుపడ్డాడు. ఆది పోకిరి స్కిట్ ఢీ 15లో నవ్వులు పూయించింది.
ఢీ సీజన్ 15కి శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈసారి కూడా టాలెంటెడ్ టీమ్స్ కంటెస్టెంట్స్ గా వచ్చారని తెలుస్తుంది. గత సీజన్స్ మాదిరి ఢీ 15 సైతం సక్సెస్ ఫుల్ ట్రాక్ లో దూసుకుపోవడం ఖాయం. ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ ఢీకి విపరీతమైన ఆదరణ తెచ్చారు. వారిద్దరి రొమాన్స్, యాంకరింగ్ మంచి క్రేజ్ తెచ్చింది. అనూహ్యంగా ఢీ 14 నుండి రష్మీ, సుధీర్ లను తొలగించారు. సీజన్ 13లో చేసిన దీపికా పిల్లికి కూడా గుడ్ బై చెప్పేశారు.
మల్లెమాల హైపర్ ఆదిని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. జబర్దస్త్ లో అయితే ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటున్నాడు. సిల్వర్ స్క్రీన్ మీద బిజీ అవుతున్న హైపర్ ఆది ఎప్పుడైనా బుల్లితెరకు బై బై చెప్పే అవకాశం ఉంది. అతను నటుడిగా, రైటర్ గా రాణిస్తున్నారు. లేటెస్ట్ సూపర్ హిట్స్ ధమాకా, సార్ చిత్రాలకు హైపర్ ఆది డైలాగ్స్ అందించారని సమాచారం. అతను స్టార్ డైలాగ్ రైటర్ గా ఎదిగే సూచనలు కలవు. హైపర్ ఆది రైమింగ్, టైమింగ్ చాలా బాగుంటుంది. హైపర్ ఆది కెరీర్లో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం.