Homeఅంతర్జాతీయంWestern Media Fake News Middle East: వెస్ట్రన్ మీడియా చెప్పేది అబద్ధం.. అమెరికా యుద్ధ...

Western Media Fake News Middle East: వెస్ట్రన్ మీడియా చెప్పేది అబద్ధం.. అమెరికా యుద్ధ విమానాలు కూలింది ఇందుకే!

Western Media Fake News Middle East: మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అనేక రకాలుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షమైన పాత్ర పోషిస్తుంది. ఇరాన్ మీద దాడులు చేస్తోంది. ఏకపక్షంగా సాగిపోతున్న అమెరికాకు ఒక్కసారిగా షాక్ తగిలింది.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

కువైట్ గగన తలంలో అమెరికాకు చెందిన 4 F – 15 E స్ట్రైక్ ఈగల్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయి. అయితే ఈ విషయాలను కువైట్, వెస్ట్రన్ మీడియా వేరే విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి.

కువైట్ లో అమెరికాకు ఎయిర్ డిఫెన్స్ ఉంది. ఈ ఎయిర్ డిఫెన్స్ నుంచి ప్రయోగించిన మిసైల్స్ ఇరాన్ ఫైటర్ జెట్స్ అనుకుని అమెరికన్ ఫైటర్ జెట్స్ ను కూల్చి వేశాయని వెస్ట్రన్ మీడియా చెబుతోంది. వాస్తవానికి ఇరాన్ ఫైటర్ జట్లు సొంత దేశంలో ఉన్న గగనతలం మీదనే ఎగరడం లేదు. అటువంటివి కువైట్ దాకా ఎలా వస్తాయి. మొదటి రోజున దాదాపు 200 దాకా అమెరికా, ఇజ్రాయిల్ ఫైటర్ జెట్స్ ఇరాన్ రాజధాని గగన తలం మీద స్వేచ్ఛగా ఎగిరాయి. బాంబుల వర్షం కురిపించాయి.

ఇరాన్ వద్ద బలమైన ఫైటర్ జెట్స్ లేవు. ఇరాన్ వద్ద కేవలం ఎఫ్ 4 ఫాంటమ్, ఎఫ్ 14 టామ్ క్యాట్ జెట్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదు. వాటిని 1979లో ఇరాన్ రాజు అమెరికా నుంచి కొనుగోలు చేశాడు. 1979 నుంచి అమెరికాకు ఇలాంటి దేశానికి బలమైన సంబంధాలు లేవు. ఎఫ్ 4, ఎఫ్ 14 యుద్ధ విమానాలకు స్పేర్ పార్ట్స్ లేకపోవడంతో అవి పని చేయడం లేదు.

అమెరికన్ ఫైటర్ జెట్లు కూలిపోయిన తర్వాత వెస్ట్రన్ మీడియా ఏదో రకరకాల కథనాలను వండి వార్చింది. కానీ దీని వెనక అసలు విషయం వేరే ఉంది.. ఒక ఫైటర్ జెట్ కు iif.. identification a friend or foe అనే సిస్టం అమర్చి ఉంటుంది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో రాడారు ఆబ్జెక్టు వైపు ఇది సిగ్నల్ పంపుతుంది. అది రిసీవ్ చేసుకున్న తర్వాత ఫైటర్ జెట్ లో ఉన్న ఐఐఎఫ్ ట్రాన్స్పాండర్ వెంటనే ఎన్క్రిప్టెడ్ సిగ్నల్ పంపిస్తుంది. ఫైటర్ జెట్ నుంచి సిగ్నల్స్ రాగానే.. రాడార్ చెక్ చేసుకుంటుంది. అది స్నేహంగా ఉంటుందా.. తటస్థంగా ఉంటుందా.. శత్రువు మాదిరిగా ఉంటుందా అనేది తెలుసుకుంటుంది. సిగ్నల్ గనక శత్రువు లేదా తటస్థంగా ఉందని నిర్ధారించుకుంటే.. వెంటనే ఫైర్ కంట్రోల్ రాడార్ రెస్పాండ్ అవుతుంది. టార్గెట్ మీదికి మిస్సైల్ వెళ్లే విధంగా సిగ్నల్ ఇస్తుంది. ఈ వ్యవస్థ మొత్తం పని చేయడానికి ఎటువంటి ఆపరేటర్ అవసరం లేదు. ఇది పూర్తిగా స్వతంత్రమైన.. స్వేచ్ఛపూరితమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టం ద్వారా జరుగుతుంది. ఇటువంటి వ్యవస్థను సామాన్యమైన ఎత్తులో లేదా కొండల మీద.. లేదా లోయల్లో ఏర్పాటు చేస్తారు.

కువైట్ ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్ వద్ద ఏర్పాటుచేసిన అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇద్దరు ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ఆపరేటర్ల ముందు రాడార్ స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ లో ఫైటర్ జెట్ ట్రాన్స్పాండర్ నుంచి వచ్చే సిగ్నల్స్ ను ఐఐఎఫ్ చెప్పేస్తూ ఉంది. ఒకవేళ అది ఫ్రెండ్లీ అయి ఉంటే సిగ్నల్ అదే విధంగా వచ్చేది కదా. అప్పుడు అమెరికన్ జెంట్స్ కూలిపోయి ఉండేవి కాదు కదా.

ఇజ్రాయిల్, అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ పరిధిలో పనిచేసే ఫైటర్ జెట్స్ మొత్తానికి ఐఎఫ్ఎఫ్ సిస్టం ఉంది. అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా ఇంటరాగేటర్.. రిసీవర్సు ఉన్నాయి. ఐఎఫ్ఎఫ్ సిస్టం నిర్వహించడం చాలా ఖరీదైనది. ప్రతి ఫైటర్ జెట్, పేరు డిఫెన్స్ సిస్టం మొత్తానికి వీటిని అమర్చాలి. గల్ఫ్ దేశాలకు.. ముఖ్యంగా కువైట్ కు ఇలా అమర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కువైట్ దినార్ 3.25 డాలర్లకు సమానం. మన కరెన్సీ లో అయితే 300 దాకా ఉంటుంది. ఈ ప్రకారం చూసుకుంటే వెస్ట్రన్ మీడియా చెప్పింది మొత్తం అబద్ధం. ఫ్రెండ్లీ వార్ అనేది ఆవాస్తవం.

ఇరాన్ డ్రోన్ ఆపరేటర్లు ఇప్పటికే నాలుగు అమెరికన్ ఫైటర్ జెట్లను కూల్ చేశారు. డ్రోన్లతో అమెరికన్ ఫైటర్ జెట్లను కూల్చివేయడం మామూలు విషయం కాదు.. కువైట్ ప్రాంతంలో f 15 e strike eagle జెట్స్ గగనతనంలో పెట్రోలింగ్ చేపడుతున్నాయి.. తక్కువ ఎగురుతూ.. సెంట్రి డ్యూటీ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి డ్రోన్ ఆపరేటర్లను ఈ వ్యవస్థ ఎందుకు పసిగట్ట లేకపోయింది. పైగా డ్రోన్ ఆపరేటర్లు నేరుగా ఫైటర్ జెట్స్ ను డ్రోన్లతో ఢీ కొట్టించారు. ఫైటర్ జెట్ కు సంబంధించిన వర్టికల్ స్టెబిలైజర్ ను డ్రోన్ తగలడంతో నేరుగా భూమి మీద పడిపోయాయి. కూలిపోయిన నాలుగు ఫైటర్ జెట్ లకు మిసైల్స్ తగిలిన ఆనవాళ్లు కనిపించలేదు. ఇరాన్ చేసిన దాడుల నేపథ్యంలో తమ జెట్ కూలిపోయాయని చెబితే పరువు పోతుందని వెస్ట్రన్ మీడియా ఇలాంటి కలరింగ్ ఇస్తోంది. ఒకవేళ రష్యా దేశానికి చెందిన ఫైటర్ జెట్స్ కనుక కూలిపోతే వెస్ట్రన్ మీడియా మరో విధమైన ప్రచారం చేసేది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular