US strategy against Iran: వెనెజువెలాలో క్రూడాయిల్‌ను దోచుకుపోయేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప ఇటీవల ఆ దేశంపై సైనిక ఆపరేషన్ చేపట్టారు. వెనుజువెలా డిఫెన్స్ సిస్టం మొత్తాన్ని నిలిపివేసి ఆ దేశంలోకి వెళ్లిన అమెరికా సైనికులు అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీంతో ఇప్పుడు అమరికా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏ దేశంలోనైనా ఈ తరహా ఆపరేషన్ చేయగమన్న ధీమా వ్యక్తమవుతోంది. మరోవైపు వెనుజువెలాలోకి అమెరికా కంపెనీలను పంపించి ఆయిల్ తోడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వెనెజువెలా తరహా వ్యూహం ఇప్పుడు ఇరాన్‌పై అమలు చేయాలని ట్రంప భావిస్తున్నారు.
వెనెజువెలా ఆపరేషన్ పాఠాలు
చిన్న దేశంపై యుఎస్ రహస్య చర్య విజయవంతమైంది. 3 కోట్ల జనాభా, అటవీ భూభాగాలతో వెనెజువెలా సులభ లక్ష్యం. అయితే, మచాడో అధికార ఆకాంక్షలు నెరవేరకపోవటం, ఉపాధ్యక్షురాలు తిరుగుబాటు ప్రకటించటం యుఎస్‌కు కొత్త సమస్యలు తెచ్చాయి. సైనిక ఉన్నతి అవసరమైతే గెరిల్లా పోరాటాలు, ప్రజా ఐక్యత ప్రమాదకరం. ప్రజలు దేశం కోసం తిరగబడితే అమెరికా సైనికులు శవాల్లా అమెరికాకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అమెరికా ప్రజల మూడ్ మారి.. ట్రంప్‌కే ప్రమాదం రావొచ్చు.
ఇరాన్‌పై దాడి అంత ఈజీకాదు..
ఇరాన్‌లో ప్రభుత్వంపై అంతర్గత నిరసనలు పెరుగుతున్నాయి. మత నాయకులపై ప్రజల కోపం యుఎస్‌కు అవకాశం కల్పిస్తోంది. 16.5 లక్షల చదరపు కి.మీ. విస్తీర్ణం, రష్యా–చైనా మద్దతుతో ఇది సంక్లిష్ట లక్ష్యం. ఆంక్షలు, రహస్య ఆపరేషన్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా ఇరాన్‌పై దాడి చేసింది. ఇరాన్ ప్రతీకారంగా ఖతార్ అమెరికా బేస్‌ను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ట్రంప్ సంధి చేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ద్వారా పరోక్ష చర్యలకు ప్లాన్ చేస్తున్నారు.
భౌగోళిక, సైనిక సవాళ్లు
ఇజ్రాయెల్ జోర్డాన్, సిరియా దాటి ఇరాన్ చేరడం కష్టం. అదే జరిగితే గల్ఫ్ మూసివేత బెదిరింపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలిస్తుంది. యెమెన్, లెబనాన్, లిబియా, ఇరాక్ వంటి ప్రాంతాలు అస్థిరంగా మారతాయి. న్యూక్లియర్ కార్యక్రమాలపై ఆందోళనలు అమెరికాపై ప్రభావం చూపుతాయి.
ప్రపంచ సంబంధాల ప్రభావం
ఇరాన్ ఒంటరిగా లేదు. రష్యా, చైనా మద్దతు ఉంటే యుఎస్ చర్యలు విస్తరించవు. భారత్ వంటి దేశాలు దౌత్యపరంగా మద్దతు ఇవ్వవచ్చు. రెండో ప్రపంచ యుద్ధాల తర్వాత అమెరికా బలమైన ప్రత్యర్థులతో నేరుగా పోరాడలేదు. క్యూబా, పనామా, ఇరాక్ వంటి బలహీన దేశాలేపైనే దాడి చేసింది.
భారత్‌లో మోదీపై కిడ్నాప్ ఊహాగానాలు ఉన్నా, ఇది అసంభవం. భారత్ భౌగోళిక, సైనిక బలం యుఎస్‌ను ఆలోచింపజేస్తుంది. ట్రంప్ విధానాలు దౌత్య ఒత్తిడికి మాత్రమే పరిమితమవుతాయి. దీర్ఘకాలంలో స్వతంత్ర విధానాలు కీలకం.