Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ రెండోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విషయంలో వెంకటేష్ చాలా క్లారిటీగా ఉన్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ ఆయన మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. త్రివిక్రమ్ సైతం ఈ సినిమాతో విజయాన్ని సాధించి నెక్స్ట్ ఎన్టీఆర్ తో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా సెట్స్ కి వెళ్లాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. వెంకటేష్ ఇమేజ్ తార స్థాయికి వెళ్ళిపోతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇంతకుముందు వెంకటేష్ – అనిల్ రావిపూడి తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా సైతం అదే రేంజ్ లో కలెక్షన్స్ ని కొల్లగొట్టినట్లైతే బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల కలెక్షన్స్ ని రాబడిన సీనియర్ హీరోగా వెంకటేష్ గొప్ప పేరు సంపాదించుకుంటాడు…
ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఈ సినిమా కథని మొదట వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో ఈ స్టోరీ వెంకటేష్ దగ్గరికి వచ్చిందట. ఇంతకీ ఆయన ఎవరితో ఈ సినిమా చేయాలనుకున్నాడు అంటే తమిళ్ స్టార్ హీరో అయిన కమల్ హాసన్ తో ఈ సినిమా చేయాలనుకున్నారట. కానీ కమల్ హాసన్ కొన్ని సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదట.
దాంతో వెంకటేష్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది వెంకటేష్ కి, త్రివిక్రమ్ కి ఇద్దరికీ చాలా కీలకమనే చెప్పాలి. ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో అవి కామన్ గా మనకు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు…
