Homeజాతీయ వార్తలుBihar Terror Network: బిహార్‌లో తీగ లాగితే.. ఘజ్వా ఎ హింద్ డొంక కదిలింది!

Bihar Terror Network: బిహార్‌లో తీగ లాగితే.. ఘజ్వా ఎ హింద్ డొంక కదిలింది!

Bihar Terror Network: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు భద్రత దళాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులు రాకుండా సరిహద్దుల్లో సైన్యం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అయితే అంతర్గత ఉగ్రవాదులు దేశానికి ప్రమాదకరంగా మారుతున్నారు. భారతీయులుగా పుట్టి విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశాన్ని ధ్వంసం చేయడానికి సహకరిస్తున్నారు. తాజాగా బిహార్‌లో జరిగిన అరెస్టుల పరంపరతో పెద్ద కుట్ర బయటపడింది. చిన్న వ్యక్తుల ద్వారా పాకిస్తాన్‌ హ్యాండిల్స్‌కి సున్నితమైన సమాచారాన్ని పంపించి, దేశీయ చరిత్రకూ, ప్రజాస్వామ్యానికి విధ్వంసకమైన ఫలితం కానివ్వాలని రూపొందించిన గుట్టు రట్టయింది. ఒక విస్తృతమైన నెట్‌వర్క్‌ బయటపడింది.

అరెస్టుల పరంపరతో పెద్ద నెట్‌వర్క్‌..
బిహార్‌కు చెందిన మహ్మద్‌ అహద్‌ అరెస్టు ఒక సన్నివేశం మాత్రమే. అంతకుముందు ముందుగా మహ్మద్‌ సద్దాం వంటి వ్యక్తుల అరెస్టులు లింక్‌ను బయటపెట్టాయి. బిహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లో నెట్‌వర్క్‌ జోరుగా ఉన్నట్టు స్పష్టంగా బయటపడింది. పాకిస్తాన్‌కు సంబంధించిన హ్యాండిల్స్‌ రాణా హుస్సేన్, రాణాభాయ్‌ ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నాయి. పుల్వారీ షరీఫ్‌ మాడ్యూల్‌ వంటి సరళీకృత కానీ ప్రమాదకర శిబిరాలు స్థానిక వాయిదాలుగా, ఐదు నుంచి ఆరు రాష్ట్రాల్లో అడ్డు లేకుండా పాకిస్తాన్‌ లక్ష్యాలకు సేవలందిస్తున్నారు.

కీలక పాత్రధారులు వీరే..
ఖుర్షీద్‌ ఆలమ్, మహ్మద్‌ ఫరాజ్, మహ్మద్‌ షకీర్‌ మేవ్‌ వంటి యువకులు నగదు సమాహరణ, సైబర్‌ కమ్యూనికేషన్, స్థానిక సమాచార తరలింపుల్లో వ్యవహరిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా ఫండింగ్, వాట్సాప్‌/ఇమెయిల్‌/సోషల్‌ అకౌంట్లు ద్వారా కమ్యూనికేషన్, సైబర్‌ గ్రూపుల ద్వారా రిక్రూట్‌మెంట్‌ చేస్తున్నారు. పాకిస్తాన్‌ హ్యాండిల్స్‌ రాణా హుస్సేన్, రాణాభాయ్, నెపాల్‌ మార్గాల ద్వారా పారిపోవలసిన ప్రయత్నాలు, అంతర్జాతీయ జలమార్గాల కట్టుబాటు ఒక అంతర్జాతీయ ఫ్రేమ్‌ సూచిస్తుంది.

ఎలా పనిచేస్తున్నారు?
షహజాద్‌ భట్టి వంటి స్థానిక గ్యాంగ్‌లు మతపరమైన నేతృత్వంతో యువకులను భావోద్వేగపూరితంగా ఆకర్షించడం. వాట్సాప్‌ గ్రూపులు, పాకిస్తాన్‌ అకౌంట్‌లు, ఇమెయిళ్లు. కోడ్‌లతో కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ను నిర్వహించడం జరుగుతోంది. స్థానిక మాధ్యమాల ద్వారా చిన్న మొత్తాల సేకరణ కీలక పాత్ర పోషిస్తోంది.

జాయింట్‌ ఆపరేషన్‌..
కొద్దిరోజులు ముందు మహ్మద్‌ సద్దాం అరెస్టు అయ్యాడు. ఇతను బిహార్‌లోని మిల్కిఖాన్‌పూర్‌లో అరెస్టు చేశారు. ఈ సద్దాం రాణాభాయ్‌ అనే పాకిస్తాన్‌ హ్యాండ్లర్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. ఇక్కడి సమాచారం పంపుతున్నాడు. అక్కడి ఆదేశాలు ఇక్కడ అమలు చేస్తున్నాడు. ఇతని ఇంటి వెనక పొదల్లో ఒక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిగురించి ఆరా తీయగా తాను గతంలో ముంబైలో ఉన్నానని, ఆ సమయంలో కొందరు తుపాకీ ఇచ్చినట్లు తెలిపారు. ఇతడు పట్టుకోవడానికి కారణం మౌలానా ఇజహరుల్‌ హక్‌ అనే మతగురువు. ఈతను మదుబని జిల్లాలో పట్టుకున్నారు. బిహార్, మధ్యప్రదేశ్‌ యాంటి టెర్రరిజమ్‌ బృందాలు జాయింట్‌ ఆపరేషన్‌ చేశాయి. వీరంతా ఒక రాణా హుస్సేన్‌ అనే అమీర్‌ కింద పనిచేస్తున్నారు. ఈయనను ప్రశ్నించగా కొన్ని మధ్యప్రదేశ్‌లోని ఒక డిస్పెన్సరీలో వైద్యుడి వద్ద పనిచేసే మహ్మద్‌ ఫరాజ్‌ అనుమానంతో అదుపులోకి తీసుకుని ఆరా తీయగా వీరంతా దొరికారు. ఫరాజ్‌ వివరాలు ఉత్తరప్రదేశ్‌లోని సమరంపూర్‌లోని ననౌటా గ్రామంలో నయీం అబ్దుల్లా ఖురేషి అనే వ్యక్తి ఇచ్చాడు. ఆయన వద్ద పాకిస్తాన్‌కు చెందిన సమాచారం ఉంది. పాకిస్తాన్‌ కోసం పనిచేయాలని సూచిస్తున్నట్లు సమాచారం రావడంతో అతడిని పట్టుకుని విచారణ చేయగా లింకులన్నీ బయటపడ్డాయి.

ఖురేషీ కీలకం..
ఖురేషీ దొరకడానికి కారణం బిహార్‌కు చెందిన ఖుర్షీద్‌ ఆలం అనే యువకుడు కారణం. ఈతను క్యూఆర్‌కోడ్‌ ద్వారా ధనం సేకరిస్తున్నాడు. ఇతడిని ప్రశ్నించగా రాజస్తాన్‌లోని అల్వర్‌కు చెందిన మహ్మద్‌ షకీర్‌ మేవ్‌ అనే వ్యక్తి దొరికాడు. కరుడుగట్టిన మతోన్మాది ఇతను. ఈ సమాజం మొత్తం ఇంతే. సైబర్‌ నేరాలకు పాల్పడుతుంటారు. ఖుర్షీద్‌ ఆలంతో డొంక కదిలింది. ఇతను వెస్ట్‌ చెంపారాకు చెందినవాడు. తర్వాత మార్చి నెలలో 12 మంది అల్‌ఖాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్, ఐసిస్‌ గ్రూపలతో కలిసి పనిచేసేవారు పట్టుపడ్డారు. ఇదంతా బిహార్, ఏపీ, ఢిల్లీ పోలీసులు జాయింట్‌ యాక్షన్‌లో దొరికాడు.

బెనెక్స్‌ డాట్కాతో సంబంధాలు..
వీరికి బెనెక్స్‌ డాట్కా అనే సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఇది ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఉన్నాయి. సంస్థ గురించి ఆరా తీస్తుండగా మహ్మద్‌ అబ్దుల్‌ ఇనాం దొరికాడు. ఇతనికి కోడ్‌ నేమ్‌ ఎల్‌ఏడీ డాట్‌ఎన్‌ ఉంది. ఇతను నేపాల్‌కు పారిపోతున్న సమయంలో సీమా సశ్ర బల్కి సంబంధించిన పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నాయి. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హత్యకు కట్ర చేశాడు. ఉపదేశ్‌రాణా, ఢిల్లీకి చెందిన నుపుర్‌ శర్మను హత్య చేయాలనుకున్నాడు. ఇతను 42 ఈమెయిల్‌ ఐడీలతో అనేక బెదిరింపు లేఖలు రాశారు. తీగలాగితే ఈ మొత్తం నెట్‌వర్క్‌ బయటపడింది. దీనికి నిషేధిత పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన పుల్వారీ షరీఫ్‌ మాడ్యూల్‌తో సంబంధం ఉంది. ఇది బిహార్‌లో ఉంది. పుల్వారీ షరీఫ్‌ మాడ్యూల్‌ను పట్టుకున్న కాగితాలు, పత్రాల్లో 2047లో భారత దేశంలో సరియా పాలన తీసుకురావాలని ఎవరిని చంపాలి, ఏం చేయాలనేవివరాలు దొరికాయి. 2023లో ఇది బయటపడింది.

పీఎఫ్‌ఐ నిషేధించినా, కార్యాకలాపాలు ఆగినట్లు కనిపించినా దాని నెట్‌వర్క్‌ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ బిహార్‌ వరకు విస్తరించింది. ఇలాంటి మాడ్యూల్స్‌ను ధ్వంసం చేయకపోతే భారత్‌లో హింస రచన చేయడం ఖాయం. ఇది దేశానికి చాలా ప్రమాదకరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version