Homeఅంతర్జాతీయంUS Universities: ట్రంప్‌ వస్తున్నాడు.. అంతకన్నా ముందే వచ్చేయండి.. అమెరికా యూనివర్సిటీల పిలుపు!

US Universities: ట్రంప్‌ వస్తున్నాడు.. అంతకన్నా ముందే వచ్చేయండి.. అమెరికా యూనివర్సిటీల పిలుపు!

US Universities: అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్‌ 300 పైగా ఎలక్టోరల్‌ ఓట్లతో విజయం సాధించాడు. 2025, జనవరి 20న వైట్‌హౌప్‌లో అడుగుపెట్టబోతున్నారు. తాను అధికారంలోకి వస్తే వలసలను పూర్తిగా నియంత్రిస్తానని, వలస వాదులను దేశంలో నుంచి పంపిస్తానని ట్రంప్‌ ఎన్నికల సమయంలో పదే పదే చెప్పారు. దీంతో అమెరికా ఫస్ట్‌ నినాదంతో ముందుక వెళ్లారు. అమెరికన్లు.. ట్రంప్‌కే పట్టం కట్టారు. దీంతో వసల వచ్చిన వారిలో ఆందోళన మొదలైంది. దీనికి అనుగుణంగానే వివేక్‌ రామస్వామి పది లక్షల మంది ఉద్యోగాలు పోతాయని అధికారం చేపట్టక ముందే హెచ్చరించారు. దీంతో వలస వచ్చినవారిలో టెన్షన్‌ మరింత పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చిన అమెరికాలోని యూనివర్సిటీలు అప్రమత్తం అయ్యాయి.

త్వరగా రావాలని మెస్సేజ్‌లు..
అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అంతర్జాతీయ విద్యార్థులక ఇప్పటికే అడ్మిషన్లు ఇచ్చాయి. రీ ఎంట్రీ వీసా ఉండి, శీతాకాల విరామ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు.. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టక ముందే తిరిగి రావాలని మెస్సేజ్‌లు పంపుతున్నాయి. స్ప్రింగ్‌ అకడమిక్‌ సీజన్‌ ప్రారంభమయ్యే జనవరి 6వ తేదీలోపు అమెరికా రావాలని పేర్కొంటున్నా. ఈమేరు తమ విద్యార్థులకు నార్త్‌ ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం సమాచారం పంపింది. మసాచుసెట్స్, వెస్లియన్, మిడిల్హౌటౌన్‌ తదితర యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులు, విజిటింగ్‌ స్కాలర్లు, అధ్యాపకులు, సిబ్బందికి ఇదే తరహాలో మెస్సేజ్‌లు పంపించాయి. లేఖలు కూడా రాశాయి. ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు మరింత కఠినం అయ్యే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలు జాగ్రత్త పడుతున్నాయి.

2017లో ఆంక్షలు..
ట్రంప్‌ మొదటి సారి అధికారంలోకి వచ్చిన 2017లో కొద్ది రోజులకే అమెఇకా తిరిగి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులపై ఆంక్షలు విధించారు. ఇరాన్‌ సహా ఏడు ముస్లిం దేశాల ప్రయాణికులపై నిషేధం విధించారు అమెరికాలోకి ప్రవేశంచడం ఆలస్యమయ్యేలా నిబంధనలు అమలు చేశారు. నాటి అనుభవం నేపథ్యంలో వర్సిటీలు ఈ సారి అలాంటి నష్టం జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈసారి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలియని నేపథ్యంంలో ముందుగానే రావడం మంచిదని విద్యార్థులకు సూచనలు ఇస్తున్నాయి.

జనవరి 19 డెడ్‌లైన్‌..
శీతాకాలంలో బయటి దేశాలకు వెళ్లినవారు 2025, జనవరి 19 నాటికి క్యాంపస్‌లకు తిరిగి రావాలని యూనివర్సిటీలు సూచిస్తున్నాయి. ఈమేరకు వెస్లియన్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల కార్యాలం ద్వారా లేఖలు పంపింది. మొత్తంగా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ముందే అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో అడుగు పెట్టాలన్న ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ప్రయాణాలకు సంబంధించి మార్పులు సూచిస్తున్నట్లు విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

మొత్తంగా చిన్న పిల్లలు అన్నం తినకుంటే బూచోడు వస్తున్నాడని తల్లులు భయపెట్టినట్లుగా… అమెరికా యూనివర్సిటీలు ఇప్పుడు ట్రంప్‌ను చూపించి అంతర్జాతీయ విద్యార్థులను భయపెడుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version