https://oktelugu.com/

Ali: కమెడియన్ అలీకి నోటీసులు.. రెండోసారి హెచ్చరికలు.. ఏం జరుగనుంది?

ఈ మధ్య సెలబ్రిటీలకు, నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఏపీలో వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులు ఇస్తున్నారు. తెలంగాణలో హైడ్రా నోటీసులు ఇస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 24, 2024 / 03:29 PM IST

    Ali

    Follow us on

    Ali: తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల నోటీసులు అందుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ఏదైనా కేసు నమోదైతే నేరుగా విచారణ చేశారు. అయితే నోటీసులు ఇవ్వకుండా విచారణ చేయడాన్ని న్యాయస్థానాలు తప్పు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఏ కేసు నమోదైనా ముందస్తుగా నోటీసులు జారీ చేస్తున్నారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా సినీ నటుడు, వైసీపీ నేత అలీకి నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఇవి పోలీసుల నుంచి కాదు.. ఎక్‌మామిడి గ్రామపంచాయతీ ఈ నోటీసులు జారీ చేసింది.

    కారణం ఇదే..
    సినీ నటుడు అలీకి వికారాబాద్‌ జిల్లా నవాబాద్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. ఫామ్‌హైస్‌లో ఎలాంటి అనుతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఈమేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి శోభారాణి నోటీసులు ఇచ్చారు. వెంటనే ఆ నిర్మాణాలు ఆపేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేయాలని సూచించారు.

    ఎక్‌మామిడిలో ఫామ్‌హౌస్‌..
    ఇదిలా ఉంటే.. సిని ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అందరూ హైదరాబాద్‌లో ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే ఫామ్‌ హౌస్‌ కల్చర్‌ వచ్చాక హైదరాబాద్‌ చుట్టపక్కల ఉన్న గ్రామాల్లో సినీ, రాజకీయ నాయకులు, ధనవంతులు స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా మంది ఈ ఫాం హౌస్‌లలో సేంద్రియ పంటలు కూడా సాగు చేస్తున్నారు. తమకు ఇష్టమైన జంతువులను పెంచుకుంటున్నారు. నటుడు అలీ కూడా ఎక్‌ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 345లో స్థలం కొనుగోలు చేసి ఫాంహౌస్‌ నిర్మించుకున్నారు. అయితే తాజాగా ఆయన అందులో కొన్ని నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై గతంలోనే పంచాయతీ తరఫున నోటీసులు ఇచ్చారు. అయినా అలీ స్పందించలేదు. దీంతో తాజాగా మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈసారి స్పందించకుంటే పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం.. చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.