Homeఅంతర్జాతీయంKamala Harris Vs Trump: తనకంటే అందంగా ఉంటానన్న ట్రంప్‌.. పిరికివారి మాటలన్న కమల!

Kamala Harris Vs Trump: తనకంటే అందంగా ఉంటానన్న ట్రంప్‌.. పిరికివారి మాటలన్న కమల!

Kamala Harris Vs Trump: అమెరికా అధ్యక్ష ఎన్నిలు ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో అధికార డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్, ప్రతిపక్ష రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సెప్టెంబర్‌లో ఇద్దరి డిబేట్‌ కూడా జరుగనుంది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటేనే ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తాయి. ఆ దేశ ఎన్నికల ప్రచారం కూడా ఆదర్శంగా ఉంటుంది. టెక్నాలజీని వాడుకుని ఓటర్లను ఆకర్షిస్తుంటారు. వ్యక్తిగత ధూషణలు, విమర్శలు ఉండవు. అభివృద్ధి, ఎజెండాపైనే డిబేట్లు ఉంటాయి. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా అమెరికాలో కూడా ఎన్నికల ప్రచార సరళి మారుతోంది. అక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు, ధూషణలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక రాజకీయాల్లో ఈధోరణి పెరిగింది. మునుపెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారం తీరు దిగజారింది. తాజాగా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌పై మరోసారి నోరుపారేసుకున్నారు. కమలా హారిస్‌ కంటే తానే ఎంతో అందంగా ఉంటానంటూ పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఆమె నవ్వు భయంకరంగా ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమలా హారిస్‌ అందంగా ఉంటారంటూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ రాసిన ఓ కాలమ్‌పై స్పందిస్తూ ట్రంప్‌ ఇలా తన అసహనం వ్యక్తంచేశారు. కమలా హారిస్‌ ఆర్థిక విధానాలపైనా ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాలో కమ్యూనలిజం సిద్ధాంతాలను తీసుకొస్తామంటూ కమలా హారిస్‌ శుక్రవారం(ఆగస్టు 17న)చేసిన వ్యాఖ్యలకు ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. కమలా కామెంట్స్‌కు అభ్యంతరం తెలుపుతూ సోషల్‌ మీడియాలో ట్రంప్‌ ఓ పోస్ట్‌ షేర్‌ చేశారు.

ఘాటుగా స్పందించిన కమలా…
ట్రంప్‌ తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలపై కమలా హ్యారిస్‌ కూడా ఘాటుగా స్పందించారు. పికికివాళ్లే అలా మాట్లాడతారని విమర్శించారు. తన రన్నింగ్‌మేట్స్‌తో కమలా హ్యారిస్‌ పెన్సిల్వేనియాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ఇటీవలికాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోంది. ఎదుటివారిని దెబ్బకొట్టడం అనేది నాయకుడి చతురతపై ఆధారపడి ఉంటుంది. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడేవారంతా పిరికివాళ్లే’ అని ట్రంప్‌కు కౌంటర్‌ ఇచ్చారు.

ట్రంప్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థిగా కమలా హారిస్‌ పోటీ చేస్తుండటం తెలిసిందే. మూడు వారాల ముందు నుంచే కమలా హారిస్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. కమలా హారిస్‌ నల్ల జాతీయురాలా? భారతీయ సంతతికి చెందిన వ్యక్తో చెప్పాలంటూ గతంలో ప్రశ్నించారు. తనపై కూడా కమలా హారిస్‌ తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసిందని.. అందుకే తాను ఆమెనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు ట్రంప్‌ తన నోటిదురుసును సమర్థించుకున్నారు. ఈ ఏడాది నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు నెలలకు పైగా టైమ్‌ ఉంది. అప్పుడే ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలతో కంపు రేపుతున్నారు. ముందు ముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని మీడియా వర్గాలు అంచనావేస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version