https://oktelugu.com/

America: అమెరికాలో తెలుగు టెక్కీ మృతి… విహారం కోసం వెళ్లి విషాదం నింపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి!

విద్య, ఉద్యోగం.. కారణం ఏదైనా కానీ.. అమెరికా వెళ్లడమే లక్ష్యంగా భారతీయ విద్యార్థులు కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా అప్పోసప్పో చేసి తమ పిల్లలను అగ్రరాజ్యంలో చదివించేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 19, 2024 12:39 pm
    America(1)

    America(1)

    Follow us on

    America: డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చుకోవడానికి భారతీయులు అగ్రరాజ్యం అమెరికాకు క్యూ కడుతున్నారు. గతంలో సంపన్న కుటుంబాలకే పరిమితమైన అమెరికా చదవులు, ఉద్యోగాలు ఇప్పడు మిడిల్‌ క్లాస్‌కు చేరువయ్యాయి. టాలెంట్‌ ఉంటే చాలు విదేశీ చదువులకు వెళ్లేందుకు ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి. ఆర్థికసాయం అందించి ప్రోత్సహిస్తున్నాయి. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. దీంతో చాలా మంది అమెరికా బాట పడుతున్నారు. అమెరికా వెళ్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లుగానే.. అమెరికాలో వివిధ కారణాలతో మృతిచెందుతున్న భారతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొందరు ప్రమాదవశాత్తు మృతిచెందుతుంటే.. కొందరు హత్యకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇలాగే అగ్రరాజ్యంలో అసువులు బాస్తున్నారు. తాజాగా అమెరికాలో మరో తెలుగు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి బుచ్చిబాబు (40) మృతిచెందాడు.

    విహారయాత్రకు వెళ్లి..
    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు కాలిపోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీకెండ్‌ కావడంతో శనివారం సాయంత్రం ఫ్యామిలీతో కలిసి సరదాగా బీచ్‌ కు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటమునిగి బుచ్చిబాబు మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విషయం తెలిసి అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుచ్చిబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.

    ఇటీవలే తెలంగాణ విద్యార్థి..
    తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్‌ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్‌ ట్రైనింగ్‌ చేసేందుకు వెళ్లిన రాజేశ్‌.. ఐదు రోజుల క్రితం మృతి చెందాడు. రాజేశ్‌ కూడా సముద్రంలో మునిగి చనిపోయాడు. కానీ అతని మృతికి కారణాలు తెలియలేదు.తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. రాజేశ్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు. తొమ్మిది నెలల క్రితం రాజేశ్‌ తండ్రి మరణించాడు.

    ఆందోళన కరంగా తెలుగువారి మరణాలు..
    ఇటీవల కాలంలో భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన పలువురు విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లినవారు విగత జీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకుంటోంది.