https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ లో మళ్ళీ మొదలైన చెల్లి సెంటిమెంట్.. రాబోతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ అవే!

మెగాస్టార్ చిరంజీవి వసిష్ఠ దర్శకత్వం లో 'విశ్వంభర' అనే చిత్రం చేసాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కూడా చెల్లి సెంటిమెంట్ ఉంటుందట. ఇందులో చిరంజీవి కి ముగ్గురు సోదరీమణులు ఉంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 19, 2024 / 12:29 PM IST

    Tollywood(2)

    Follow us on

    Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు సిస్టర్ సెంటిమెంట్ మీద ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలు, భారీ బడ్జెట్ గ్రాఫిక్ సినిమాలు, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను చేస్తూ ఇలాంటి కథలకు దూరమయ్యారు. కానీ త్వరలో రాబోతున్న స్టార్ హీరోల సినిమాలను చూస్తుంటే సిస్టర్ సెంటిమెంట్ ట్రెండ్ టాలీవుడ్ లో మరోసారి మొదలైనట్టు తెలుస్తుంది. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి చెల్లి సెంటిమెంట్ మీద ‘భోళా శంకర్’ అనే చిత్రం చేసాడు. ఇందులో చిరంజీవి కి చెల్లెలు గా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.

    ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి వసిష్ఠ దర్శకత్వం లో ‘విశ్వంభర’ అనే చిత్రం చేసాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కూడా చెల్లి సెంటిమెంట్ ఉంటుందట. ఇందులో చిరంజీవి కి ముగ్గురు సోదరీమణులు ఉంటారు. ఆ పాత్రల్లో ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి నటిస్తున్నారు. ఈ సినిమాకి ఈ నేపథ్యం హైలైట్ కానుంది. సెంటిమెంట్ అద్భుతంగా కుదిరిందట. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, ‘నా సామి రంగ’ ఫేమ్ ఆషిక రంగనాథ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. అలాగే ఈ నెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న న్యాచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ చిత్రం కూడా చెల్లి సెంటిమెంట్ అత్యంత కీలకంగా ఉండబోతుందట. నాని కి చెల్లెలు గా ‘అరివి’ మూవీ ఫేమ్ అదితి బాలన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. వరుస ఫ్లాప్స్ డీలా పడిన టాలీవుడ్ ని చెల్లి సెంటిమెంట్ తో రాబోతున్న ‘సరిపోదా శనివారం’ చిత్రం కాపాడుతుందా లేదా అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా యంగ్ హీరో నితిన్ వేణు శ్రీరామ్ తో ‘తమ్ముడు’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

    శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో నితిన్ అక్క కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో నితిన్ కి అక్క పాత్రలో సీనియర్ హీరోయిన్ లైలా నటించింది. ఇక సిస్టర్ సెంటిమెంట్ మీద తెరకెక్కుతున్న మరో సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటిస్తున్న ‘మెరుపు’. ఇందులో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుంది. కళ్యాణ్ రామ్ కి ఇందులో ఆమె అక్కగా కూడా నటిస్తుంది. వీళ్లిద్దరి మధ్య సాగే అనుబంధం సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలుస్తుందట. అలా రాబోయే టాలీవుడ్ సినిమాలన్నీ సిస్టర్ సెంటిమెంట్ తో నిండిపోయాయి.