Green Land : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై గురిపెట్టారు. ఇప్పటికే కెనడా(Canada)ను 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని, పనామా(Panama) కాలువను స్వాధీనం చేసుకుంటామని అభాసుపాలయ్యాడు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై దృష్టి పెట్టారు. తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడే గ్రీన్‌లాండ్ కొంటామని అన్నాడు. అయితే సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రంప్ 2.0 మరోమారు పట్టుబడుతన్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచే గ్రీన్‌లాండ్ అమెరికా(America) వైమానిక స్థావరంగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సోవియట్ నుంచి, తర్వాత ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు నాటో సైనిక కూటమి తరఫున ఆ స్థావరం నిర్వహిస్తోంది. గ్రీన్‌లాండ్, కెనడా, అలస్కా, నార్వే, స్వీడన్, ఫిన్‌ఆండ్, డెన్మార్క్, రష్యాలు అతి శీలత ఆర్కిటిక్ సముద్ర ప్రాంతంలో ఉన్నాయి. వేసవిలో ఆర్కిటిక్ సముద్రం మంచు దశాబ్దానికి 12.2 శాతం చొప్పున కరుగుతోంది. వాతావరణ మార్పులతో ప్రస్తుత దశాబ్దాం ముగిసేలోపే మంచు లేని ఆర్కిటిక్(Arcitic) సముద్రాన్ని చూస్తామని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మంచు కరిగితే నౌకల రవాణా పెరుగుతుంది. అక్కడి అపార చములు, గ్యాస్ నిక్షేపాలు, అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ పెరుగుతుంది. అరుదైన నిక్షేపాలు ఇక్కడే ఉన్నాయి. మంచు కరిగితే నిక్షేపాలు తవ్వుకోవచ్చన్న ఆలోచనలో చాలా దేశాలు ఉన్నాయి.
వనరుల కోసం అన్వేషణ..
ఆర్కిటిక్ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తే చైనా, జపాన్ నుంచి సరుకులను ఆ మార్గంలోనే అమెరికా, ఐరోపాలకు పంపవచ్చు. సూయజ్ , పనామా కాలువలపై ఒత్తిడి తగ్గుతుంది. దూరం, సమయం తగ్గి రవాణా పెరుగుతుంది. ఉత్తర సముద్రమార్గానికి రక్షణపరమైన ప్రాధాన్యం ఎక్కువ. చైనా, రష్యా నౌకాదళాలు 2022, 2023లో ఆర్కిటిక్‌లోని బేరింగ్ జలసంధిలో విద్యాసాలు చేశాయి. గత అక్టోబర్‌లో రష్యా, చైనా తీర రక్షక నౌకలు సంయుక్త విద్యాసాలు నిర్వహించాయి. ఈ రెండు దేశాలు కలిసి వనరులు అన్వేషిస్తున్నాయి. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్నాయి. రక్షణ పరంగా ముందుకుసాగుతున్నాయి. ఇక అమెరికా, నాటో(Nato) దేశాలూ అదే పని చేయనున్నాయి. అందుకే గ్రీన్‌లాండ్ కొనాలని ట్రంప్ పట్టుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్కిటిక్ మహాసముద్ర ఉపరితలంపై మంచును చీల్చుకంటూ పయనించే ఐస్ బ్రేకర్ నౌకల తయారీపై అమెరికా, బ్రిటన్, ఫిన్‌లాండ్ దృష్టిపెట్టాయి. ఈమేరకు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ప్రతిగా రష్యా కూడా కొత్త నౌకల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ కాంట్రాక్టును భారత్‌కు ఇవ్వాలని రష్యా యోచిస్తోంది. ఈమేరకు రష్యా(Russa) నిపుణులు ఇప్పటికే భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు షిప్‌యార్లుల్లోని నౌకల నిర్మాణ వసతులను పరిశీలించారు.
భారత్ కూడా పరిశోధనలు..
ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా సౌలభ్యం పెరుగుతుందని గ్రహించిన భారత్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. నార్వేలోని స్వాల్బార్లాండ్‌లో 2008లో మొదటి పరిశోధన కేంద్రం హిమాద్రి(Himadri)ని స్థాపించింది. అయితే రష్యాపరిధిలోని ఆర్కిటిక్‌కు భారత శాస్త్రవేత్తలు ఇంకా చేరుకోలేదు. అక్కడి మూర్ మల్క్ ప్రాంతంలో సాఫార్మ్ అన భారతీయ పార్మా కంపెనీ ఔషధ ఉత్పత్తి కర్మాగారిర్మాణం 2023లోనే ప్రారంభించింది. మరోవైపు బైడెన్ హయాంలో ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా–చైనా కూటమికి, అమెరికా–నాటో కూటమికి మధ్య పోటీ పెరిగింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి. మారుతున్న అంతర్జాతీయ సమీకరణలతో భారత్ కూడా వనరుల అన్వేషణకు సిద్ధమవుతోంది.