Health Tips
Health Tips: మనలో చాలా మందికి ఉదయం కాస్త లేటుగా నిద్రలేవాలనే ఉంటుంది. అయితే ఉద్యోగం, చదువులు ఇలా రకరకాల కారణాల వల్ల త్వరగా లేవాల్సి వస్తుంది. అందుకే అలారం పెట్టుకుని మరీ ఉదయాన్నే నిద్ర లేస్తుంటాం. అయితే కొందరు అలారం మోగగానే ఉలిక్కి పడి హఠాత్తుగా నిద్రలో నుంచి బయటికి వస్తుంటారు. ఇలా జరగడం వల్ల ఉదయాన్నే మూడ్ పాడైపోయి కంగారుగా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్, కాలేజీకి వెళ్లే పిల్లలు ఉంటే, ఆఫీసుకి వెళ్లే ఉద్యోగులు త్వరగా లేవడానికి అలారం పెట్టుకుంటారు. అయితే, అలారంతో నిద్రలేచే అలవాటు ఉన్నవారికి కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.
గుండెకు మంచిది కాదు
అలారంతో నిద్రలేవడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ హెల్త్ రీసెర్చ్ ప్రకారం.. అలారం శబ్దం మీ గుండె ఆరోగ్యానికి హానికరం. అలారం శబ్దం రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. అలారం శబ్దం రక్తపోటును పెంచడమే కాకుండా.. అడ్రినలిన్‌ను పెంచుతుంది.. ఒత్తిడి స్థాయిలను కూడా పెంచుతుంది.
శరీరం సహజ గడియారాన్ని దెబ్బతీస్తుంది
మీరు అలారం శబ్దంతో మేల్కొంటే.. మీ స్లీపింగ్ సైకిల్ చెడిపోతుంది. మన శరీరాలు సిర్కాడియన్ రిథమ్‌ను అనుసరిస్తాయి. ఇది 24 గంటల అంతర్గత గడియారంలా పనిచేస్తుంది. నిద్ర, మేల్కొనే విధానాలతో సహా వివిధ శారీరక ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఈ సహజ లయ సూర్యుడు ఉదయించే, అస్తమించే సమయానికి చక్కగా ట్యూన్ అయి ఉంటుంది. మీరు గాఢమైన నిద్రనుంచి మేల్కొంటే.. మీ స్లీప్ సైకిల్‌కు అడ్డంకి ఎదురువుతుంది. దీంతో లైఫ్ గజిబిజిగా, చికాకుగా మారుతుంది.
ఒత్తిడి పెరుగుతుంది.
అలారం శబ్దానికి మేల్కొనడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీ శరీరం అలారం శబ్దంతో ఫైట్-ఆర్-ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఇది కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు తక్షణ బెదిరింపులను ఎదుర్కోవడానికి అవసరం అయినప్పటికీ, ఈ హార్మోన్లు అధికంగా విడుదలైనప్పుడు ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. ఒత్తిడి హార్మోన్లు పెరిగినప్పుడు, అవి రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరుగుదలకు కారణమవుతాయి.
మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది..
మీరు అలారం శబ్దానికి మేల్కొంటే.. అది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగ నియంత్రణ, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అలారం ద్వారా మీ నిద్రకు అంతరాయం కలిగితే.. మీరు చిరాకు, ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది, ఇది పరోక్షంగా మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Do you wake up too much after setting the alarm
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com