Homeఅంతర్జాతీయంRussia India Relations: రష్యా–భారత్‌ సంబంధం మరింత బలోపేతం.. పుతిన్‌ పర్యటనలో వ్యూహాత్మక ఒప్పందాలు!

Russia India Relations: రష్యా–భారత్‌ సంబంధం మరింత బలోపేతం.. పుతిన్‌ పర్యటనలో వ్యూహాత్మక ఒప్పందాలు!

Russia India Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతకు వచ్చారు. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో జరిగిన పుతిన్‌ పర్యటన భారత–రష్యా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం తెచ్చింది. ఈ రెండు రోజులలో రాజకీయ, వ్యూహాత్మక, సాంస్కృతిక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జారి, ప్రత్యేకమైన విశ్వాసంతో మోదీ–పుతిన్‌ కలుసుకున్నారు. ఇప్పటి వరకు పుతిన్‌ భారత్‌లో మూడుసార్లు పర్యటించారు. మన్‌మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చారు. ఇప్పుడు మోదీ ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చారు.

దశాబ్దాల బంధం..
రష్యా–భారత్‌ సాంఘిక మరియు భౌతిక సంబంధాలు 70 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న విశ్వసనీయం. 1955లో మొదలైన పరస్పరవర్తన యుద్ధ సమయాల్లో మద్దతు ద్వారా మరింత బలపడింది. ప్రత్యేకంగా 1971లో భారత్‌ పక్కన రష్యా నిలబడటం ఈ సంబంధాలను మరింత బలోపేతమైంది,

రష్యా ప్రపంచస్థాయి శక్తి..
అతి పెద్ద భూభాగం, సమృద్ధిగా ఖనిజ వనరులు, అత్యధిక అణు శక్తి, వ్యూహాత్మక స్థాయి ప్రపంచంలో రష్యా స్థానాన్ని సుస్థిరం చేశాయి. భారత్‌ కూడా ఆయుధాలు, ఇంధనం పొందుతున్న దేశంగా ఈ శక్తి తోటపు భాగస్వామిగా ఉంది. ఇక సైనికంగా కూడా రష్యా బలమైన దేశం. రష్యాకు అణుసామర్థ్యం కూడా ఉంది. అమెరికా తర్వాత అత్యంత అణు శక్తి ఉన్న దేశం రష్యా. అంతరి„ý పరిశోధనల్లోనూ రష్యా అమెరికాతో పోటీ పడుతుంది. ఇక భద్రతా మండలిలో వీటో పవర్‌ ఉన్న ఐదు దేశాల్లో రష్యా ఒకటి. మూడు దేశాలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు. చైనా, భారత్‌కు మద్దతు ఇచ్చే దేశం రష్యా.

భారత్‌–రష్యా కీలక ఒప్పందం..
పుతిన్‌ పర్యటనలో భారత–రష్యా మధ్య రిలోస్‌ ఒప్పందం జరిగింది. ఇది రెండు దేశాలను విమానాలు, జలయానాలు, ఎయిర్‌ బేస్‌ ఉపయోగంలో పరస్పర సహకారానికి తెరచింది. హిందూ సముద్రంలో రష్యా యాజమాన్యం పెరుగుదల భద్రతా సమతౌల్యాలకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ పర్యటనలో పుతిన్‌ ప్రోటోకాల్‌ను దాటించి మోదీతో కలిసి మెయిన్‌ ఇండియా కారులో పర్యటించడం, రష్యా భాషలో ముద్రించిన భగవద్గీతను అందించడం లాంటి సంఘటనలు సంబంధాల లోతును సూచిస్తున్నాయి.

స్వేచ్ఛగా పర్యటన..
అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు పుతిన్‌ను యుద్ధ నేరస్తుడిగా ప్రకటించింది. అయితే మనం ఐసీసీలో సభ్యత్వం లేదు. అందుకే పుతిన్‌ భారత్‌లో నిర్భయంగా పర్యటించారు. రష్యాకు భారత్‌ ఆర్థికంగా అండగా ఉంటుంది. చమరు దిగుమతి చేసుకుంటూ ఆర్థికంగా సహకారం అందిస్తుంది. భారత్‌ యుద్ధాన్ని మాత్రం వ్యతిరేకిస్తుంది. ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉంది.

భారత్‌–రష్యా మధ్య కుదిరిన రిలోస్‌ అగ్రిమెంట్‌ ప్రపంచంపై ప్రభావం ఉంటుంది. హిందూ సముద్ర జలాల్లో రష్యా లంగర్‌ వేసేందుకు ఈ ఒప్పందం కీలకం. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో అమెరికాకు మూడు రేవులు ఉన్నాయి. ప్రాన్స్, బ్రిటన్‌కు ఉన్నాయి. చైనా కూడా కొత్తగా నిర్మించుకుంటుంది. భారత్‌–రష్యా రిలోస్‌ ఒప్పందం ఒక గేమ్‌ చేంజర్‌గా మారుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular