Dhurandar Movie: రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన స్పై యాక్షన్ చిత్రం ‘దురంధర్’ (Dhurandar Movie) బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈమధ్య కాలం లో ఇలాంటి అర్థవంతమైన యాక్షన్ థ్రిల్లర్ ని చూసి చాలా కాలం అయ్యిందని, సినిమా నిడివి 3 గంటల 30 నిమిషాలు ఉన్నప్పటికీ, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడని, కచ్చితంగా ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో ది బెస్ట్ గా ఈ చిత్రం నిలిచిపోతుందని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఇండియా వైడ్ గా 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను ఈ చిత్రం సాధించిందని, ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల రూపాయిల రేంజ్ నెట్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ఈ చిత్రం లో హీరో గా నటించిన రణవీర్ సింగ్(Ranveer Singh) కి, అలాగే విలన్ క్యారక్టర్ లో కనిపించిన అక్షయ్ ఖన్నా లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరూ కూడా పోటీ పడి మరి నటించారంటూ చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఈ చిత్రాన్ని ముందుగా మన టాలీవుడ్ స్టార్ హీరో ని పెట్టి చెయ్యాలని అనుకున్నారట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. #RRR వంటి సెన్సేషనల్ చిత్రం తర్వాత రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూలు కట్టారు. వారిలో డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా ఒకరు. రామ్ చరణ్ కి కథ బాగా నచ్చింది కానీ , ఈ సినిమాని మొదలు పెట్టడానికి రెండేళ్ల సమయం కోరాడట.
ఎందుకంటే అప్పుడు ఆయన ‘గేమ్ చేంజర్’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే ‘పెద్ది’ చిత్రాన్ని మొదలు పెట్టాలి. అందుకే రెండేళ్ల సమయం కోరాడు. కానీ డైరెక్టర్ అప్పటి వరకు ఆగలేక, బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రణవీర్ సింగ్ కి ఈ మూవీ స్టోరీ ని వినిపించాడు. అతనికి పిచ్చపిచి గా నచ్చేసింది. వెంటనే డేట్స్ ఇచ్చి షూటింగ్ ని మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత జరిగింది మీరంతా చూస్తూనే ఉన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాని చేసి ఉంటే చాలా బాగుండేది అని అభిమానుల అభిప్రాయం. బాలీవుడ్ ఆడియన్స్ లో ఈ చిత్రం ద్వారా శాశ్వత ముద్ర వేసుకునేవాడు, బ్యాడ్ లక్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘దురంధర్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో ఈ చిత్రానికి పార్ట్ 2 వచ్చే ఏడాది మార్చ్ నెలలో విడుదల కానుంది.