Bigg Boss 9 Telugu Ritu Chaudhary Elimination: నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో గొప్ప ఆదరణను సంపాదించుకుంది. ప్రస్తుతం 9వ సీజన్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్ అయిపోతున్న విషయం మనకు తెలిసిందే… 13వ వారం జరిగిన ఎలిమినేషన్ లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోవడంతో ఇప్పుడు ఏడుగురు కంటెంట్ మాత్రమే ఉన్నారు… తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, డిమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన ఉన్నారు… ఇక ఈ ఏడుగురిలో నెక్స్ట్ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇద్దరిని ఒకే వారం ఎలిమినేట్ చేసి ఆ తర్వాత వారం నుంచి టాప్ 5 కంటెస్టెంట్ల తో గ్రాండ్ ఫినాలే స్టార్ట్ చేయబోతున్నారట…
ఇక ఇప్పుడున్న ఆ ఏడుగురు కంటెస్టెంట్లలో నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిమీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం భరణి, సంజన ఇద్దరు వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లతో గ్రాండ్ ఫినాలే ని స్టార్ట్ చేస్తారు.
ఇక అందులో నుంచి ఆ వీక్ డేస్ లో మరో ఇద్దరిని తీసేసి శని వారం ఒకరిని తీసివేస్తే ఆదివారం ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు. ఇక ఆ ఇద్దరిలో ఒకరిని విజేతలుగా చేయడానికి రంగం సిద్ధం చేశారు…ఈసారి ఫైనల్ లో నిలిచే టాప్ 2 కాంటెస్టెంట్స్ ఎవరు అందులో ఎవరు విజయాన్ని సాధిస్తారు. ఎవరు రన్నరప్ గా మిగులుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈసారి ట్రోఫీని దక్కించుకోబోయే పర్సన్ ఎవ్వరు అనేది తెలియాలంటే మాత్రం మరొక 15 రోజుల పాటు వేచి చూడాల్సిందే…ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, డిమాన్ పవన్ బాగా ఆడుతున్నారు. ఇక ఈ నలుగురిలోనే ఎవరో ఒకరు విజయం సాధించే అవకాశం ఉందని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…