Pakistan Politics: పాకిస్తాన్‌లో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్ పదవీకాలం నవంబర్ 30న ముగిసింది. రాజ్యాంగ సవరణతో పదవి పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెక్ పెట్టారు. ఇప్పుడు షెహబాజ్ కూడా గేమ్ స్టార్ట్ చేశారు. ప్రధాని షెహబాజ్‌కు మొన్నటి వరకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండేవాడు. ఇతనిపేరు బిలాల్ బిన్ సాహిల్. ఇతని వయసు కేవలం 30 ఏళ్లు. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు మంచి ఆప్తుడు. డొనాల్డ్ ట్రంప్‌కు, ఆసిమ్ మునీర్ మధ్య సఖ్యతకు కృషి చేశాడు. ఇద్దరికీ డిన్నర్ మీట్ ఏర్పాట చేశాడు. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సీఈవోగా ఉండేవాడు. స్పెషల్ అసిస్టెంట్‌గా కూడా ఉన్నారు. అయితే షెహబాజ్ సడెన్‌గా స్పెషల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించాడు. ఇప్పుడు ఆయన స్పెషల్ అసిస్టెంట్ కాదు.. క్రిప్టో కౌన్సిల్ సీఈవో కాదు. ఇప్పుడు బలాల్ దుబాయ్ పారిపోయాడు. పాకిస్తానలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు పదవి పోయిన తర్వాత దేశం వీడుతారు. బిలాల్ కూడా వెళ్లిపోయాడు.
ఆసిమ్‌కు చెక్ పెట్టాలని..
ఆసిమ్ మునీర్ పదవీకాలం పొడిగించేలా ఆర్టిక్ 27 సవరణను ప్రధాని షెహబాజ్ ఆమోదించలేదు. ఆ సమయంలో ప్రధాని లండన్‌లో తన అన్న నవాజ్ షరీఫ్ వద్ద ఉన్నాడు. దీంతో ఆసిమ్ మునీర్ పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో డిసెంబర్ 4న ఈజిప్ట్ సైనికాధికారులు వచ్చారు. దీంతో ఆసిమ్ సివిల్ డ్రెస్‌లో వారిని కలిశారు. మరోవైపు ఆసిమ్ ఆప్తుడిని కూడా పదవి నుంచి తొలగించారు.
అమెరికా చర్యలకు డిమాండ్..
ఇదిలా ఉంటే అమెరికా కాంగ్రెస్‌లోని 44 మంది సభ్యులు ఆసిమ్‌పై చర్య తీసుకోవాలని, ఇమ్రాన్‌ఖాన్‌ను అన్యాయంగా జైల్లో ఉంచాడని, మానవ హక్కులు హననం చేస్తున్నాడని, తన భార్య పిల్లల కోసం 15 బిలియన్ డాలర్లతో కాలిఫోర్నియాలో ఇల్లు కట్టాడు.. దానిని కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రమీలా జైపాల్ నాయకత్వం వహించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు. దీంతో ఆసిమ్ మునీర్‌కు అమెరికాలోనూ అగ్గి రాజుకుంది. పాకిస్తాన్‌లో పదవి పోయింది. దీంతో పాకిస్తాన్‌లో ఏం జరుగుతుంది. ఆర్మీ చీఫ్ ఎవరు.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఎవరు. ఎప్పుడు నియమితులవుతారు అన్న చర్చ జరుగుతోంది.
ప్రధానితో ఎయిర్ చీఫ్ భేటీ..
ఈ క్రమంలో పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ మహ్మద్ బాబర్ సిద్దు ప్రధాని షెహబాజ్‌ను కలిశారు. ఆర్మీ చీఫ్ చెప్పినట్లు నేవీ, ఎయిర్‌ఫోర్స్ వినాలి. ఈ క్రమంలో ఎయిర్ చీఫ్ మార్షన్ ప్రధానిని కలవడం కీలకంగా మారింది. ఒకవైపు అన్న నవాజ్ సలహాతో షెహబాజ్ పాకిస్తాన్‌లో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు లండన్‌లోఉన్న నవాజ్–షెహబాజ్ కలిసి ఆసిమ్ మునీర్ తోక కత్తిరించే పని చేస్తున్నారు.
ఇమ్రాన్‌తో టచ్‌లో ఆసిమ్..
ఇదిలా ఉంటే.. ఆసిమ్ ఇప్పుడు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌కాన్‌కు వర్తమానం అందించినట్లు సమాచారం. ఇమ్రాన్‌ను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నా. సైన్యం ఒకవైపు వస్తే షెహబాజ్ పదవి కోల్పోయే అవకాశం ఉంది. మొత్తంగా షెహబాజ్, నవాజ్, ఆసిమ్ ముగ్గురూ.. పాకిస్తాన్‌లో మూడు ముక్కలాట నడిపిస్తున్నారు.
పాకిస్తాన్‌లో రాజకీయ, సైనిక వర్గాల మధ్య తీవ్ర అస్థిరత కొనసాగుతూ, ప్రధాన సైనిక అధిపతుల నియామకాల విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నది. ప్రధాన నాయకత్వాల్లో ఉన్న విభజనలు దేశంలోని స్థిరత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరాయి.