Homeఅంతర్జాతీయంUS Israel Strike On Iran Near Indian Ocean: అమెరికా దాడి.. భారత్ కు...

US Israel Strike On Iran Near Indian Ocean: అమెరికా దాడి.. భారత్ కు వచ్చిన ఇరాన్ యుద్ధం… కలకలం..

US Israel Strike On Iran Near Indian Ocean: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. మొదటిరోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చారు. దీంతో ఇరాన్‌ ఇజ్రాయెల్‌తోపాటు, అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలై ఇరాన్‌ వైమానికి దాడులు చేస్తోంది. దీంతో దుబాయ్, సౌదీ అరేబియా, ఖతార్, దోహాఖతార్, బహ్రెయిన్, ఒకమన్‌తోపాటు అనేక దేశాల్లో అమెరికా స్థావరాలు, అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా తీవ్రంగా నష్టం జరుగుతోంది. దీంతో అమెరికా ఇరాన్‌పై ఏ అవకాశం దొరికినా వదిలి పెట్టడం లేదు. తాజాగా ఇరాన్‌ నౌకపై దాడి చేసింది. వంద మందిని చంపేసింది.

Also Read: విజయ్–రష్మిక పెళ్లి రిసెప్షన్.. ప్రముఖుల సందడి.. వైరల్ పిక్స్

భారత సరిహద్దులో..
అరేబియా మహాసముద్రంలో శ్రీలంక తీరాల సమీపంలో జరిగిన ఈ ఘటన ఇరాన్‌ సైనిక నౌకను లక్ష్యంగా చేసుకుంది. విశాఖపట్నం నేవీ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి దేశానికి వెళ్తుండగా అమెరికన్‌ సబ్‌మెరైన్‌ దాడి చేసింది. అధికారిక ప్రకటనలో అమెరికా ఈ చర్యను ధ్రువీకరించింది. ఈ దాడిలో 100 మంది సిబ్బంది మరణించారు, 80 మంది తీవ్ర గాయాలతో రక్షించబడ్డారు. క్షతగాత్రులను శ్రీలంక రక్షించింది. ఆస్పత్రులకు తరలించింది. మతృదేహాలను ఇరాన్‌కు తరలించింది.

భౌగోళిక, రాజకీయ నేపథ్యం
శ్రీలంక తీరాలు భారత మహాసముద్ర ప్రవేశ ద్వారాల్లో ముఖ్యమైనవి. ఇక్కడ ఇరాన్‌ నౌక ఉండటం చైనా–ఇరాన్‌ సంబంధాలు, ’బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ వంటి వ్యూహాలతో ముడిపడి ఉండవచ్చు. అమెరికా ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో చర్య తీసుకుందని విశ్లేషకులు అంచనా. అంతర్జాతీయ జలాల్లో అమెరికా దాడి చేయదన్న ధైర్యంతో ఇరాన్‌ నౌక స్వదేశానికి బయల్దేరింది. కానీ, అమెరికా నిబంధనలకు విరుద్ధంగా దాడి చేసింది.

ఇరాన్‌ ప్రతిస్పందన
అమెరికా దాడిపై ఇరాన్‌ స్పందించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మరోవైపు గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఇలాంటి ఘటనలు సైనికుల మానసిక స్థితిని ప్రభావితం చేసి, భవిష్యత్‌ మిషన్‌ల్లో జాగ్రత్తలు పెంచుతాయి. మరోవైపు భారతదేశం, శ్రీలంక తమ జలాంతర్గాల భద్రతను పరిశీలిస్తున్నాయి.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular