US Elections 2024: యూఎస్‌ ఎలక్షన్స్‌.. మారుతున్న భారతీయ అమెరికన్ల నాడి.. ఆ పార్టీకి పెరుగుతున్న మద్దతు!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌/డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఇప్పటికే బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఓటరు నాడి తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వే చేస్తున్నాయి. భారతీయ అమెరికన్ల నాడి పట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : ఆగస్ట్ 14, 2024 1:00 సా.

US Elections 2024

Follow us on

US Elections 2024: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తాయి. ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలో ఉన్నది ఎవరో ఇప్పటికే తేలిసోయింది. అధికార డెమొక్రటిక్‌ పార్టీ తరఫున మొదట అధ్యక్షుడు బైడెన్‌ రేసులో నిలిచారు. కానీ, అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ రేసులోకి వచ్చారు. ఇక ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రప్‌ పోటీ చేస్తున్నారు. ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కమలా హ్యారిస్‌ కూడా దూకుడు పెంచారు. ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత అతనికి ఆదరణ పెరిగింది. అన్ని సర్వే సంస్థలు ట్రంప్‌నకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. ఇండో అమెరికన్లు కూడా ట్రంప్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అయితే కమలా హ్యారిస్‌ అభ్యర్థి అయ్యాక ప్రజల నాడి మారుతోంది. దీంతో పలు సంస్థలు మరోమారు సర్వేలు చేస్తున్నాయి. ఫలితాలను ప్రకటిస్తున్నాయి.

మారుతున్న భారతీయ అమెరికన్లు..
ఇంతకాలం భారతీయ అమెరికన్ల మద్దతు ట్రంప్‌కే ఉన్నట్లు సర్వే సంస్థలు తేల్చాయి. అయితే కమలా హ్యారిస్‌ రేసులోకి వచ్చాక భారతీయ అమెరికన్ల నాడి మారుతోంది. తాజా సర్వే ఫలితాల్లో ఆశ్చర్యకరమైన ధోరణిని సూచిస్తున్నాయి. నివేదికల ప్రకారం బారతీయ అమెరికన్లు డెమొక్రటిక్‌ పార్టీకి అనుకూలంగా మారుతున్నారు. ఇటీవలి సర్వేలో 68% మంది భారతీయ అమెరికన్‌ ఓటర్లు డెమొక్రటిక్‌కు మొగ్గు చూపగా, 29% మంది రిపబ్లికన్లకు మద్దతు తెలిపారు.

ప్రభావం చూపే రాష్ట్రాలు ఇవే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువగా ప్రభావం చూసే రాష్ట్రాలు జార్జియా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలే. ఈ రాష్ట్రాల్లోనే భారతీయ అమెరికన్ను ఎక్కువగా ఉన్నరు. 2022 జనాభ లెక్కల ప్రకారం.. దాదాపు 4.8 మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉన్నారు, ఆసియా అమెరికన్‌ జనాభాలో 20% ఉన్నారు. వీరిలో, 66% వలసదారులు మరియు 34% అమెరికాలో జన్మించారు.కాలిఫోర్నియా (20%), టెక్సాస్‌ (12%), న్యూజెర్సీ (9%)లో సగం మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. న్యూయార్క్‌ (7%) ఉన్నారు. భారతీయ అమెరికన్ల సగటు కుటుంబ ఆదాయం 2022లో 1,45,000 డాలర్లుగా ఉంది, ఇది మొత్తం ఆసియా అమెరికన్ల సగటు 1,00,000 డాలర్ల కంటే ఎక్కువ.

ప్రాథమికంగా ఇండియన్‌గా..
చాలా మంది భారతీయ అమెరికన్లు (41%) ప్రాథమికంగా ‘ఇండియన్‌‘ గా గుర్తించారు, అయితే 21% మంది ‘ఇండియన్‌ అమెరికన్‌‘ని ఉపయోగిస్తున్నారు. భారతీయ అమెరికన్లు సాధారణంగా అమెరికా(86% అనుకూలమైనది), భారతదేశం (76% అనుకూలమైనది) రెండింటి పట్ల సానుకూల అభిప్రాయాలను కలిగి ఉంటారు. అయినప్పటికీ, 65% మంది భారతదేశానికి తిరిగి వెళ్లరు, అమెరికాలో స్థిరపడటం వంటి కారణాలను పేర్కొంటూ తిరిగి వచ్చే వారికి ప్రధాన కారణం. దాదాపు సగం మంది భారతీయ అమెరికన్లు (48%) అమెరికన్‌ కలను సాధించే మార్గంలో ఉన్నారని భావిస్తున్నారు, అయితే 27% మంది తాము ఇప్పటికే దానిని సాధించామని నమ్ముతున్నారు. మతం ముఖ్యమైనది, 48% మంది హిందువులుగా, 15% మంది క్రై స్తవులుగా, 15% మంది మతపరంగా సంబంధం లేనివారుగా మరియు 8% మంది ముస్లింలుగా గుర్తించారు.