https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసుకొని బాధపడుతున్న ఆ స్టార్ డైరెక్టర్… ఇలాంటివి ముందే చూసుకోవాలి కదబ్బా…

సినిమా ఇండస్ట్రీ లో ఏ రోజు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని సార్లు కొంతమంది డైరెక్టర్లు టాప్ హీరోలతో సినిమాలు చేస్తారు. కానీ ఆ కాన్సెప్ట్ స్టార్ హీరో కి సెట్ అవ్వదు...పెద్దగా స్టార్ డమ్ లేని హీరో తో చేస్తే సూపర్ సక్సెస్ అయ్యేది అనే విమర్శలు వస్తుంటాయి...అందుకే ఇక్కడ ఏం చేసిన కొంచెం జాగ్రత్త గా ఆలోచించి చేస్తే బాగుంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 14, 2024 / 12:52 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో అల్లు అర్జున్…మొదటి సినిమాతో ఆయనకు సరైన గుర్తింపు అయితే రాలేదు. కానీ ఆర్య సినిమాతో హీరోగా నిలబడటమే కాకుండా స్టైలిష్ స్టార్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడా తడబడకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా ఎదగడమే కాకుండా పుష్ప 2 సినిమాతో మరోసారి తన స్టామినాని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత తమిళ్ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అట్లీ అత్యధికంగా రెమ్యూనరేషన్ ను అడగడం వల్ల గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అయిన అల్లు అరవింద్ ఈ సినిమాని క్యాన్సిల్ చేశాడు. ఇక దాంతో అట్లీ ఇప్పుడు కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట.

    అది అట్లీ కి ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందని తెలుస్తుంది. నిజానికి అల్లు అర్జున్ తో ఈ సినిమా చేసి ఉంటే బాగుండేది అని తన సన్నిహితుల దగ్గర అట్లీ చెబుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదంతా చూసిన జనాలు మాత్రం ఎవరితో సినిమా చేయాలి ఎలాంటి సినిమా చేయాలనేది ముందే నిర్ణయించుకోవాలి. ఒకసారి ఒకరితో కమిట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు.

    కాబట్టి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు బ్రదర్ అంటూ అతన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు…ఇక ఈ సినిమాలతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్న అట్లీ మరి సల్మాన్ ఖాన్ తో చేస్తున్న సినిమాతో తనకు ఇష్టం లేకపోయిన ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీంతో మంచి సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక తన గత చిత్రమైన జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కి భారీ సక్సెస్ ని అందించిన అట్లీ ఇప్పుడు ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ కి కూడా ఒక భారీ సక్సెస్ ని అందించి తను కూడా ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదుగాలని చూస్తున్నాడు. మరి ఆయన అనుకున్నట్టుగానే జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరో కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పడం…