https://oktelugu.com/

UK: బ్రిటన్‌ ప్రధాని వివాదాస్పద ఆతిథ్యం.. క్షమాపణలు చెబుతారా?

బ్రిటన్‌ కొత్త ప్రధాని కీర్‌ స్టార్మర్‌. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రిషి సునక్‌పై విజయం సాధించి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అధికారికంగా బ్రిటన్‌లోని హిందుతో దీపావళి వేడుకలు నిర్వహించారు. కానీ, ఆయన చేసిన పని వివాదాస్పదమైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 10, 2024 / 04:11 PM IST

    UK(2)

    Follow us on

    UK: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ టార్మర్‌ సారథ్యంలోని లేబర్‌ పార్టీ.. ఈ ఏడాది జరిగిన బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో రిషి సునక్‌ సారథ్యంలోని కన్జర్వేటివ్‌ పార్టీపై విజయం సాధించింది. స్టార్మర్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌లో భారతీయులు ఎక్కువ. మన దేశాన్ని పాలించిన నేపథ్యంలో అప్పటి నుంచే భారతీయులు బ్రిటన్‌కు రాకపోకలు సాగించేవారు. ఇక ఇప్పటికు విద్యా, ఉద్యోగాల కోసం యూకే వెళ్తున్నారు. మొన్నటి వరకు బ్రిటన్‌ ప్రధానిగా ఉన్న రిషి సునక్‌ కూడా భారతీయ సంతతి వ్యక్తే. హిందువు కూడా. క్రిష్టియన్లు ఎక్కువగా ఉండే బ్రిటన్‌లో ఏటా వివిధ హిందువుల పండుగలు కూడా నిర్వహిస్తుంది. కీర్‌ స్టార్మర్‌ అధికారంలోకి వచ్చాక వచ్చిన దీపావళిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు 10–డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదాస్పదంగా మారింది.

    నాన్‌వెజ్, మద్యం..
    యూకే ప్రధాని అధికారిక నివాసం 10–డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు హాజరయ్యారు. దీపాలు వెలిగించారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ప్రధాని కీర్‌ స్టార్మర్‌ మాట్లాడారు. తర్వాత అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు. అయితే అతిథులుగా వచ్చిన తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తమకు నాన్‌వెజ్, లిక్కర్‌ అందించారని బ్రిటన్‌లోని హిందువులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రముఖ బ్రిటిష్‌ హిందూ పండితుడు సతీశ్‌కె.శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లుగా ప్రధాని అధికారిక నివాసంలో వేడుకలు జరుగుతున్నాయని, ఎప్పుడూ నాన్‌వెజ్‌ ఐటమ్స్, వైన్, బీర్‌ వంటివి ఇవ్వలేదని తెలిపారు. ఈసారి మాంసాహారంతో వంటకాలు పనెట్టారని పేర్కొన్నారు. మూర్ఖత్వం ప్రదర్శించారని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

    క్షమాపణ చెబుతారా..
    దీపావళి వేడుకల్లో కీర్‌ స్టార్మర్‌ సలహాదారులు అజాగ్రత్తగా, నిÆర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై ప్రధాని కీర్‌ స్టార్మర్‌ క్షమాపణలు చెప్పాలని సతీశ్‌కె.శర్మ డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్, భారత్‌లో చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై బ్రిటన్‌ ప్రధాని స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే బ్రిటన్‌లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కన్జర్వేటివ్‌ పార్టీ అధికారం కోల్పోయింది. లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.