Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తనకు సహయకులుగా, కార్యాలయ ఇన్‌చార్జీలను నియమిస్తున్నారు. ఈమేరకు కసరత్తు చేస్తున్నారు. సెక్యూరిటీ నుంచి.. అన్ని శాఖలకు ఎవరెవరిని నియమించాలో ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇదే సమయంలో తన కేబినెట్‌లో ఎవరెవరికి ఏఏ శాఖలు ఇవ్వాలనే విషయంలోనూ సమాలోచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్త సుజీ వైల్స్‌ను వైట్‌హౌస్ స్టాఫ్ చీఫ్‌గా ట్రంప్ నియమించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి తనతో పోటీ పడిన నిక్కీ హేలీకి ట్రంప్ షాక్ ఇచ్చారు. వైట్‌హౌస్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ప్రకటించారు.
సోషల్ మీడియాలో పోస్టు..
వైట్‌హౌస్ కార్యవర్గంలోకి నిక్కీ హేలీతోపాటు మైక్ పాంపియోను వైట్‌హౌస్ కార్యవర్గంలోకి తీసుకోబోనని ట్రంప్ తెలిపారు. ఈమేరకు తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘నిక్కీ హేలీ, మైక్ పాంపియోను తన కొత్త కార్యవర్గంలోకి ఆహ్వానించం లేదు. గతంలో వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అమెరికాకు వారు గొప్ప సేవ చేశారు. వారికి ధన్యవాదాలు’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
స్పందించిన హేలీ..
ఇదిలా ఉంటే ట్రంప్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై నిక్కీ హేలీ కూడా స్పందించార. గతంలో ట్రంప్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. అమెరికాను ట్రంప్ మరింత ముందుకు తీసుకెళ్లారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నిక్కీ హేలీ అమెరికా రాజకీయవేత్త, దౌత్యవేత్త. 2011 నుంచి 2017 వరకు సౌత్ కరోలినా 116వ గవర్నర్‌గా, యునైటెడ్ స్టేట్స్ అంబాసాడ్‌కు 29వ రాయబారిగా పనిచేశారు. 2017 నుంచి 2018 వరకు కేబినెట్‌లో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్. 2024 ఎన్నికలో కోసం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. అయితే ప్రైమరీ దశలోనే ఆమె వెనుకబడడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.