Homeఅంతర్జాతీయంUAE sensational decision India benefit: యూఏఈ సంచలనం.. భారత్‌కు గుడ్‌ న్యూస్‌.. పాకిస్తాన్‌కు షాక్‌!

UAE sensational decision India benefit: యూఏఈ సంచలనం.. భారత్‌కు గుడ్‌ న్యూస్‌.. పాకిస్తాన్‌కు షాక్‌!

UAE sensational decision India benefit: గల్ప్‌ దేశం యూఏఈ ఒపెక్‌+ నుంచి వైదొలిగింది. ఇది ప్రపంచ చమురు మార్కెట్‌కు సంచలనాత్మక మలుపు తిప్పింది. సౌదీ, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు, ఇరాన్‌ దాడులు ఈ నిర్ణయానికి మార్గం వేశాయి. మే 1 నుంచి అమలవుతున్న ఈ చర్య యూఏఈని గల్ఫ్‌ కూటమి నుంచి బహిర్గతం చేస్తుంది. 1967లో చేరిన మూడో పెద్ద ఎగుమతిదారు ఇప్పుడు స్వతంత్ర ఉత్పత్తి విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు రోజువారీ 3–4.8 మిలియన్‌ […]

UAE sensational decision India benefit: గల్ప్‌ దేశం యూఏఈ ఒపెక్‌+ నుంచి వైదొలిగింది. ఇది ప్రపంచ చమురు మార్కెట్‌కు సంచలనాత్మక మలుపు తిప్పింది. సౌదీ, పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు, ఇరాన్‌ దాడులు ఈ నిర్ణయానికి మార్గం వేశాయి. మే 1 నుంచి అమలవుతున్న ఈ చర్య యూఏఈని గల్ఫ్‌ కూటమి నుంచి బహిర్గతం చేస్తుంది. 1967లో చేరిన మూడో పెద్ద ఎగుమతిదారు ఇప్పుడు స్వతంత్ర ఉత్పత్తి విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు రోజువారీ 3–4.8 మిలియన్‌ బ్యారెళ్ల వరకు పెంచుతామని ప్రకటించారు.

రాజకీయ కారణాలు
ఇరాన్‌ దాడుల్లో సౌదీ మిత్రదేశాల స్పందన బలహీనంగా ఉండటం యూఏఈ అసంతృప్తికి దారితీసింది. పాకిస్తాన్‌ మధ్యవర్తిగా తటస్థంగా ఉండటంపై కోపంతో 3.45 బిలియన్‌ డాలర్ల రుణం తిరిగి వసూలు చేశారు. పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఈ రుణం తీవ్ర నష్టం కలిగించింది. అబుదాబి ఫండ్‌కు 1 బిలియన్‌ చెల్లించారు. 1.6 మిలియన్‌ పాకిస్తానీల రిమిటెన్సులు ప్రభావితమవుతాయి. సౌదీ 3 బిలియన్‌ డాలర్ల రుణం, 5 బిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ ఇచ్చి, అణు ఆయుధాల ఒప్పందం కుదుర్చుకుంది.

ఒపెక్‌ ప్రభావం
సౌదీ ఆధిపత్యానికి ఇది ప్రధాన సవాల్‌. హార్మూజ్‌ మూసివేతలతో ఇబ్బందుల్లో ఉన్న కూటమి బలహీనపడుతుంది. అమెరికా, చైనా వ్యూహాలు మారవలసి వస్తుంది. యెమెన్‌ హౌతీలపై విభేదాలు కూడా కారణం.

భారత్‌ అవకాశాలు
యూఏఈ ఉత్పత్తి పెరిగితే క్రూడ్‌ ధరలు తగ్గుతాయి. భారత్‌ దిగుమతి ఖర్చు తగ్గి, పెట్రోల్‌–డీజిల్‌ ధరలు స్థిరపడతాయి. వాటా 10.3 శాతం నుంచి 11.4 శాతం పెరిగింది. దీర్ఘకాల ఎల్‌ఎన్‌జీ, రెన్యూవబుల్‌ ఒప్పందాలు బలపడతాయి.

సౌదీ–పాక్‌–టర్కీ త్రైపాక్షిక సైనిక కూటమి ఏర్పడుతుంది. యూఏఈ స్వతంత్ర విదేశాంగ విధానం గల్ఫ్‌ డైనమిక్స్‌ మార్చనుంది. భారత–యూఏఈ ఎనర్జీ భాగస్వామ్యం బలోపేతమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper