Homeఎంటర్టైన్మెంట్Ravi Babu controversial comments: టాలీవుడ్ 90 శాతం మంది హీరోలు డూప్స్ ని...

Ravi Babu controversial comments: టాలీవుడ్ 90 శాతం మంది హీరోలు డూప్స్ ని వాడుతారు అంటూ హాట్ కామెంట్స్ చేసిన రవిబాబు..

Ravi Babu controversial comments: ప్రేక్షకులకు విచిత్రమైన అనుభూతి కలిగించే సినిమాలను అందించే దర్శకులు కొంతమంది ఉంటారు , వారిలో ప్రధానంగా మనం రవిబాబు గురించి మాట్లాడుకోవచ్చు. ఈయన కామెడీ జానర్ సినిమా తీసిన , హారర్ జానర్ సినిమా తీసిన చాలా వెరైటీ గా ఉంటాయి. అప్పుడప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలను కూడా తీస్తుంటాడు. ఏ జానర్ సినిమా తీసినా, ఆయన మార్క్ స్పష్టంగా కనిపించేలా చూసుకుంటాడు. వాటికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా […]

Ravi Babu controversial comments: ప్రేక్షకులకు విచిత్రమైన అనుభూతి కలిగించే సినిమాలను అందించే దర్శకులు కొంతమంది ఉంటారు , వారిలో ప్రధానంగా మనం రవిబాబు గురించి మాట్లాడుకోవచ్చు. ఈయన కామెడీ జానర్ సినిమా తీసిన , హారర్ జానర్ సినిమా తీసిన చాలా వెరైటీ గా ఉంటాయి. అప్పుడప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలను కూడా తీస్తుంటాడు. ఏ జానర్ సినిమా తీసినా, ఆయన మార్క్ స్పష్టంగా కనిపించేలా చూసుకుంటాడు. వాటికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. అలా వరుసగా ప్రామిసింగ్ సినిమాలు తీయడం వల్లే, రవిబాబు కి మార్కెట్ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. ఆయన సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు కూడా ఏర్పడ్డారు. ఈమధ్య కాలం లో రవిబాబు సినిమాలు రావడం బాగా తగ్గిపోయాయి. అభిమానులు అసలు రవిబాబు ఏమైపోయాడు అని అనుకుంటున్నా సమయం లో ‘రేజర్’ చిత్రాన్ని ప్రకటించాడు.

ఇప్పటి వరకు ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వచ్చే నెల 8 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అందులో ఒక ఇంటర్వ్యూ లో ఆయన పాన్ ఇండియన్ హీరోల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం మన ఇండస్ట్రీ లో 90 శాతం మంది పాన్ ఇండియన్ హీరోలు డూప్స్ తోనే కానిచ్చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతుంటారు. ప్రస్తుతం నేను తీసిన ‘రేజర్’ మూవీలో హీరో పాత్ర మధ్య వయస్సుకు సంబంధించినది. దీని కోసం ఫిజికల్ గా చాలా బలంగా ఉండాలి. తనలా నటించే వ్యక్తి దొరకలేదు , అందుకే నేనే ఈ సినిమాలో హీరో గా నటించాను. టీజర్స్ లో మీరు చూసిన ఫైట్స్ మొత్తం నేనే చేశాను , ఎలాంటి డూప్స్ వాడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రవిబాబు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper