Pooja Hegde dating young hero: హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా చెక్కు చెదరని మార్కెట్ తో , యూత్ ఆడియన్స్ లో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే(Pooja Hegde). ఈమె నుండి సూపర్ హిట్ చిత్రం విడుదలై దాదాపుగా నాలుగేళ్లు కావొస్తుంది. కానీ ఇమేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రస్తుతానికి టాలీవుడ్ కంటే కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్ లో ఈమె వరుస సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఒక టాలీవుడ్ సినిమాలో నటించేందుకు సంకటం చేసిందట కానీ, ఆ సినిమా వివరాలను మాత్రం బయటకు చెప్పలేదు. ఇక ఈమె హీరోయిన్ గా నటించిన ‘జన నాయగన్ ‘ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా ఈమె ఒక బాలీవుడ్ యంగ్ హీరో తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈమె ప్రముఖ యంగ్ హీరో రోహన్ మెహ్రా తో డేటింగ్ చేస్తుందని, వీళ్లిద్దరు గాఢమైన ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియా లో వీళ్లిద్దరు కలిసి అప్లోడ్ చేస్తున్న ఫోటోలు, బయట ప్రైవేట్ పార్టీలకు చెట్టపట్టాలు వేసుకొని తిరగడాలు వంటివి చూసి , కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ పొంగి పొర్లుతుందని బాలీవుడ్ మీడియా అంటోంది. రోహన్ మెహ్రా తో కలిసి పూజా హెగ్డే ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ పూజ కి ఇండస్ట్రీ లో ఉన్నటువంటి కొంతమంది కామన్ స్నేహితుల ద్వారా రోహన్ మెహ్రా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి , త్వరలో పెళ్లి వరకు దారి తీస్తుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి. అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు అటు పూజ హెగ్డే కానీ , ఇటు రోహన్ మెహ్రా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
బహుశా సోషల్ మీడియా లో జరుగుతున్న ఈ ప్రచారం వాళ్ళిద్దరి వరకు చేరలేదు అనుకుంటా అంటూ సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రోహన్ మెహ్రా మ్యూజిక్ వీడియోస్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి 2016 వ సంవత్సరం హిందీ బిగ్ బాస్ సీజన్ 10 లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందే ఆయన రెండు మూడు సినిమాల్లో నటించాడు కూడా. 10 వ సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిల్చిన రోహన్ మెహ్రా మంచి ఫేమ్ తో బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి , వరుసగా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.