Trump Operation Cuba: అగ్రరాజ్యాం అమెరికా అధ్యక్ష భవనం ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని ప్రకటించింది. ఈమేరు లేఖ విడుదల చేసింది. కాంగ్రెస్ అనుమతి ముగియడంతో ఈమేరకు లేఖ విడుదల చేసింది. దీంతో యుద్ధం ఆగిపోయందా అన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఫ్లోరిడాలో ప్రసంగిస్తూ, క్యూబాపై సైనిక ఆపరేషన్ చేపట్టి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇరాన్ నుంచి తిరిగి వస్తున్న సైన్యాన్ని ఉపయోగించి, అబ్రహం లింకన్ నౌకను 100 గజాల దూరంలో ఆపి, క్యూబాను ‘లొంగిపోయేలా’ చేస్తామని హెచ్చరించారు. అయితే ఇది కేవలం మాటలా? లేక నిజమైన ప్లానా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శత్రుత్వం పునరుద్ధరణ..
19వ శతాబ్దం నుంచి అమెరికా–క్యూబా మధ్య ఉద్రిక్తతలు. ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత కమ్యూనిజం, సోవియట్ మద్దతు, వ్యాపార నష్టాలు శత్రుత్వాన్ని పెంచాయి. ఒబామా కాలంలో దౌత్య సౌకర్యం మెరుగుపడినా, ట్రంప్ సంక్షలు పునఃప్రారంభించి వైరాన్ని తీవ్రతరం చేశారు. వెనెజువెలా మదురోపై చర్యల తర్వాత ’క్యూబా నెక్ట్స్’ అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు దానిని అమెరి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్యూబా పరిస్థితి..
ఇదిలా ఉంటే అమెరికా ఆంక్షలు క్యూబాను దెబ్బతీశాయి.చమురు దిగుమతుల బ్లాక్, విద్యుత్ కోతలు, నీరు–ఔషధాల కొరత ఉంది. అయినా ‘స్వతంత్ర దేశం, మేం లొంగము‘ అంటూ అధ్యక్షుడు మిగెల్ డియాజ్–కానెల్ స్పందించారు. ట్రంప్ ‘విఫల దేశం, అందమైన ద్వీపం స్వాధీనం గౌరవం‘ అన్నారు. కానీ ఇది సైనిక ఆక్రమణకు దారితీసే అవకాశం ఉంది.
పొలిటికల్ డ్రామానా?
ట్రంప్ ఫ్లోరిడా వోటర్లను (క్యూబన్–అమెరికన్లు) ఆకర్షించాలని ఈ ప్రకటన చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. ఇరాన్ సైన్యాన్ని లింక్ చేసి, బడ్జెట్ ఆదా చేయాలనే కాలిక్యులేషన్ వేసినట్లు మరికొందరు పేర్కొంటున్నారు. క్యూబా సోవియట్–రష్యా మిత్రుడు. అమెరికా దాడి చేస్తే ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చు. చైనా–రష్యా మద్దతు ఉంటే, అమెరికా ఒంటరిగా మిగిలిపోతుంది. క్యూబా భౌగోళిక స్థానం (ఫ్లోరిడా సముద్రంలో) కీలకం. స్వాధీనం అయితే వ్యాపారం, టూరిజం బూస్ట్. కానీ బయటి ప్రపంచం ఖండిస్తుంది.
ట్రంప్ మాటలు బెదిరింపుగా ఉంటాయి, కానీ అమలు అసాధ్యం. క్యూబా ప్రతిరోధం, అంతర్జాతీయ చట్టాలు అడ్డుకుంటాయి. కేవలం తమ శక్తి చాటుకోవడానికే ట్రంప్ ఇలా చేస్తున్నారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.