Three Cars Failed Miserably: ఈ మూడు కార్లు సేప్టీ రేటింగ్ లో దారుణ విఫలం.. ఎంతవరకు సురక్షితం అంటే? 

దేశంలో అత్యధికంగా కార్లు విక్రయాలు జరుపుకుంటున్న కంపెనీల్లో మారుతి ఒకటి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే  దశాబ్దాలుగా ఈ కారుకు ఉన్న ఆదరణ తగ్గడం లేదు.  2024 సంవత్సరం మొదటి త్రైమాసిక వరకు   ఈ కారు నెంబర్ వన్ గా నిలిచింది

Written By: Srinivas, Updated On : October 26, 2024 11:19 am

Three Cars Failed Miserably

Follow us on

Three Cars Failed Miserably: కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఎటువంటి కారు కొనాలనే ప్నశ్న తలెత్తుతుంది. కార్యాలయ అవసరాల కోసం కొందరు 4 వెహికల్ కొనుగోలు చేస్తారు. మరికొందరు ఫ్యామిలీతో ప్రయాణాలు చేయడానికి సొంతకారును కలిగి ఉంటారు. అయితే ఎవరు ఎలాంటి కారు కొనుగోలు చేయాలన్నా అందులో సురక్షితంగా ప్రయాణం చేయాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో కొందరు సేప్టీ ఎక్కువగా ఉండే కార్ల వైపు చూస్తారు. దీంతో సేప్టీ నే ప్రధానంగా ఉండే కార్లను కొన్ని కంపెనీలు మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే మరికొందరు లో బడ్జెట్ లో కారు కొనాలని ఆరాటపడుతారు. తక్కువ ధరకే వచ్చే కొన్ని కార్లు మార్కెట్లో ఉన్నాయి. కానీ ఇవి అంత సేప్టీ కాదని క్రాష్ టెస్టింగ్ లో తేలిపోయింది. ముఖ్యంగా రూ. లక్ష రూపాయలకే అందించే నానో కారు సేప్టీ లో ఎంత రేటింగ్ పొందిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళితే..
టాటా కంపనీకి చెందిన నానో కారు అందరికీ గుర్తుండే ఉంటుంది. సామాన్యులు సైతం కారు కొనాలనే ఉద్దేశంతో టాటా కంపెనీ ఈ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. 2009లో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో 2020లో నానొ ఉత్పత్తిని ఆపేశారు. అయితే 2014లో నానో క్రాస్ టెస్టింగ్ ను నిర్వహించారు. ఈ పరీక్షలో వచ్చిన రేటింగ్ చూసి అంతా షాక్ అయ్యారు. గ్లోబల్ NCPA క్రాష్ టెస్ట్ లో 64 కేఎంపీహెచ్  స్పీడ్ తో టెస్ట్ చేయగా కారు మొత్తం నుజ్జయింది. దీంతో ఇది ఏమాత్రం సేప్టీ కారు కాదని తేలిపోయింది. ఫలితంగా దీనికి ‘0’ (జీరో) రేటింగ్ ఇచ్చారు.
దేశంలో అత్యధికంగా కార్లు విక్రయాలు జరుపుకుంటున్న కంపెనీల్లో మారుతి ఒకటి. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వ్యాగన్ ఆర్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే  దశాబ్దాలుగా ఈ కారుకు ఉన్న ఆదరణ తగ్గడం లేదు.  2024 సంవత్సరం మొదటి త్రైమాసిక వరకు   ఈ కారు నెంబర్ వన్ గా నిలిచింది. అయితే వ్యాగన్ ఆర్ ను గ్లోబల్ క్రాష్ టెస్ట్ చేయగా షాకింగ్ రిజల్ట్ వచ్చింది. మొత్తగా ఇది 1 స్టార్ రేటింగ్ పొందడం గమనార్హం. ఇక ఇందులో చైల్డ్ ప్రొటెక్షన్ ఏమాత్రం బాగో లేదని తేలిపోయింది. అయితే మిగతా ఫీచర్స్ తో పాటు లో బడ్జెట్ కే ఈ కారు వస్తుండడంతో దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.
దేశంలో రెనాల్ట్ కార్లకు మంచి ఆదరణ ఉంది. దీని నుంచి మార్కెట్లోకి వచ్చి క్విడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ వెహికల్. కానీ ఈ మోడల్ అంత సురక్షితం కాదని తేలిపోయింది. గ్లోబల్ క్రాష్ టెస్టింగ్ లో ఈ కారు ఒక్కటంటే ఒక్కటే రేటింగ్ పొందింది. ఇక చైల్డ్ ప్రొటెక్షన్ లో జీరో గా వచ్చింది. మొత్తంగా రెనాల్ట్ క్విడ్ కారు సేప్టీలో అంత సేఫ్ కాదని తేలిపోయింది. కేవలం సేప్టీ మాత్రమే కోరుకునేవారు పై కార్లు అంత సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు.