Green Weather : మనిషి ప్రకృతితో చెలగాటమాడుతున్నాడు. ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. పచ్చటి చెట్లను కొట్టేసి.. ప్లాస్టిక్ ను పడేసి వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాడు. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను వదులుతూ కలుషితం చేస్తున్నాడు. అందుకే ఆకాశం ఇప్పుడు రంగులు మార్చుకుంటోంది. ఊహించని విధంగా మారుతోంది.

సాధారణంగా ఆకాశం నీలం, నలుపు రంగుల్లో కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ సల్ఫర్ వర్షాలు కురిస్తే ఎరుపు రంగులోనూ ఉంటుంది. సూరీడు వెలుగులకూ ఇలా ఎర్ర రంగులోకి మారుతుంటుంది. కానీ తాజాగా అమెరికాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నడూ లేని విధంగా ఆకాశం సరికొత్త రంగును పులుముకుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చోటు చేసుకున్న ఈ వింత ఘటన అధికారులను విస్తుపోయేలా చేసింది.
భారీ తుఫాన్ తర్వాత అమెరికాలో ఏర్పడిన వాతావరణం చూసి ప్రజలు అధికారులు షాక్ అయ్యారు. ఇది ఎలా వచ్చిందో తెలియక అందరూ ఆరాతీశారు. అమెరికాలోని సౌత్ డకోటా, సియోక్స్ ఫాల్స్ ప్రాంతాల్లో భారీ తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ తగ్గిన అనంతరం ఆకాశమంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీనిపై స్పందించిన అధికారులు ఈ తుఫాన్ ప్రభావంగా గంటకు 159 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయని.. కానీ ఆకాశం అలా మారడం తామెన్నడూ చూడలేదని స్థానిక అధికారులు తెలిపారు.
అయితే వాతావరణ శాస్త్రవేత్తలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎర్రటి సూర్య కిరణాలు సాయంత్రం వేళలో తుఫాన్ లోని నీరు, ఐస్ అణువులతో కలవడం వల్ల మేఘాలు ఆకుపచ్చ రంగులోకి మారుతాయని తెలిపారు.దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదని.. ప్రమాదం ఏదీ లేదని భరోసానిచ్చారు.
Green pic.twitter.com/RjjCbDUhGf
— jaden 🥞 🍦 (@jkarmill) July 5, 2022