Ponniyin Selvan: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం చేస్తున్న సినిమా “పొన్నియన్ సెల్వన్”. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రధాన పాత్రలుగా చేసిన విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తి, జయం రవి ఫస్ట్ లుక్ లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. మరీ ఆ తర్వాత ఏమిటి ? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వారి ఆసక్తిని రెట్టింపు చేస్తూ చిత్రబృందం క్రేజీ అప్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ పేరుతో ఒక టీజర్ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు అధికారకంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తిలు ఉన్నారు.
Also Read: Pavitra Lokesh- Suchendra: పవిత్ర లోకేష్ గురించి మరో సంచలన నిజాన్ని బయటపెట్టిన ఆమె భర్త
మణిరత్నం నుంచి రాబోతున్న వైవిధ్యమైన సినిమా ఇది. సడెన్ గా ఈ సినిమా గ్లింప్స్ రాబోతుంది అనేసరికి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో విభిన్నమైన చిత్రాలు చేయడానికి ప్రయత్నం చేసే మణిరత్నం, ఈ సారి నిజంగానే కొత్తరకం సినిమాను తీస్తున్నాడు.
ఇక ఈ సినిమా కథ.. రాజులు, యుద్ధాల నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాలో అత్యున్నత భారీ తారాగణం నటిస్తోంది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
అయితే, అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ పాత్ర కీలకం. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ మహారాణి పాత్రలో నటిస్తోంది. రీనిన్న ఆమె లుక్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ లుక్ లో ఐశ్వర్య రాయ్ నిజంగా మహారాణీలానే ఉంది. కాగా తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న ఓ నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇది చోళుల కథ కాబట్టి.. కథలో చాలా అంశాలు ఉంటాయి.
Also Read:Ram Charan- Shankar: ‘చరణ్ – శంకర్’ సినిమా టైటిల్ ఫిక్స్.. హాలీవుడ్ టెక్నీషియన్స్ వచ్చేశారు