Pavitra Lokesh- Suchendra: సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. సహజీవనం చేస్తుండటంతో వారి బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు కలిసి వివాహం చేసుకుంటారనే వాదన వస్తోంది. దీనిపై ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా స్పందిస్తున్నారు. పవిత్ర తన భార్యే అని స్పష్టం చేస్తున్నారు. దీంతో నరేష్, పవిత్ర లోకేష్ ల బంధంపై బిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పవిత్ర చాలా మంచిదని సుచేంద్ర ప్రసాద్ వెల్లడించాడు. నరేష్ ఎవరో తనకు తెలియదని చెబుతున్నాడు. కానీ ఆమెను ట్రాప్ చేసింది మాత్రం అతడే కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన భార్య అంటే తనకు ఎంతో ఇష్టమని తమ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందని గుర్తు చేశారు. మైసూర్ ఘటన తరువాత కూడా పవిత్ర తనకు ఫోన్ చేసిందని గుర్తు చేశాడు. నరేష్ పవిత్రను తప్పుదారి పట్టించి ఉంటాడని సందేహం వ్యక్తం చేస్తున్నాడు.
Also Read: Director B. Gopal: అప్పటి ముచ్చట్లు : ఆ తింగరి గోపాలమే.. నేడు తిరుగులేని డైరెక్టర్ అయ్యాడు
పవిత్ర లోకేష్ క్యారెక్టర్ మంచిది కాదని సుచేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నాడు. ఒకవేళ నరేష్, పవిత్ర వివాహం చేసుకున్నా వారి వివాహం ఆరునెలలు కూడా నిలవదని చెబుతున్నాడు. దీంతో సుచేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై సంచలనం కలుగుతోంది. పవిత్ర లోకేష్, నరేష్ బంధంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నాడు. పవిత్ర లోకేష్, నరేష్ ల బాంధవ్యం కూడా కడదాకా ఉండదని తెలుస్తోంది.
తమ సంసారానికి గుర్తుగా పిల్లలు ఉన్నారని తెలిపాడు. నరేష్ తన భార్యను లోబరుచుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారు. సినిమా పరిశ్రమలో ముగ్గురిని చేసుకున్న వారు ఇంకా ఉన్నారు. కానీ నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం మాత్రం సంచలనంగా మారింది. భవిష్యత్ లో వారు పెళ్లి చేసుకుంటారనే తెలుస్తోంది. ఈ క్రమంలో నరేష్ పవిత్ర కలయికపై అందరికి అనుమానాలు వస్తున్నా వారు కలవడం మాత్రం ఖాయమనే చెబుతున్నారు.
నరేష్ సైతం మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అయిపోయాడు. తన మూడో భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేస్తుండటంతో నరేష్ ఇక నాలుగో పెళ్లి కోసం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుచేంద్ర ప్రసాద్ మాత్రం నరేష్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. మరొకరి భార్యపై ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. దీంతో భవిష్యత్ లో ఏం జరుగుతుందోననే సందేహాలు అందరిలో వస్తున్నాయి. కానీ నరేష్, పవిత్ర మాత్రం వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.