Illegal Immigration: అమెరికాకు అక్రమంగా వెళుతున్న వారిలో మూడోస్థానం మనదే!!

అనుమతి లేకుండా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోందట. దీంంతో ఆ దేశం వలసలపై ఇటీవల ప్యూ పరిశోధన కేంద్రంతో సర్వే చేయించింది. ఏయే దేశాల నుంచి ఎక్కువ వలసలు వస్తున్నారో తేల్చాలని ఆదేశించింది.

Written By: Raj Shekar, Updated On : November 24, 2023 1:11 pm

Illegal Immigration

Follow us on

Illegal Immigration: ఉపాధి కోసం వలసలు వెళ్లడం సర్వ సాధారణం. మన దేశంలో అయితే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్తుంటారు. ఎక్కువగా ఆదాయం వచ్చే ప్రాంతానికి, కూలీ ఎక్కువగా ఇచ్చే జిల్లాలకు వ్యాపారులు, కూలీలు వెళ్తుంటారు. ఇలాంటి వారిలో పెద్దగా చదువుకోనివారే ఎక్కువగా ఉంటారు. అయితే చదువుకున్నవారు కూడా అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా వలసపోతున్నారు. ఉన్నత చదువుల కోసం, మెరుగైన ఉపాధి కోసం, బాగా డబ్బు సంపాదించాలని చాలా మంది విదేశాలకు వెళ్తుంటారు. మన దేశం నుంచి ఏటా లక్షల మంది ఇలా విదేశాలకు వెళ్తున్నారు. అయితే ఇలా వెళ్తున్నవారిలో ఎక్కువ మంది అగ్రరాజ్యం అమెరికాబాట పడుతున్నారు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే.. అమెరికా వెళ్తున్నవారిలో చాలా మంది అక్రమంగా వెళ్తున్నారట. ఈ విషయాన్ని ప్యూ పరిశోధన కేంద్రం నిర్ధారించింది. అయితే స్వదేశంలో ఎక్కడికైనా వెళ్లి జీవించవచ్చు. కానీ విదేశాలకు వెళ్లాలి అంటే ఆ దేశం నుంచి అనుమతిని పొందాల్సి ఉంటుంది. అయితే కొందరు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా విదేశాలకు వెళ్లి జీవిస్తుంటారు.

అమెరికాకు భారతీయుల అక్రమ వలస..
అనుమతి లేకుండా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్నవారి సంఖ్య ఏటా పెరుగుతోందట. దీంంతో ఆ దేశం వలసలపై ఇటీవల ప్యూ పరిశోధన కేంద్రంతో సర్వే చేయించింది. ఏయే దేశాల నుంచి ఎక్కువ వలసలు వస్తున్నారో తేల్చాలని ఆదేశించింది. దీంతో ఆ సంస్థ అక్రమ వలసదారుల గురించి పరిశీలనలు చేసింది. ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 2007–2021 మధ్యకాలంలో 1.05 కోట్ల మంది విదేశీయులు అమెరికా లోకి అక్రమంగా ప్రవేశించారని వెల్లడించింది. వారిలో 41 లక్షల మంది మెక్సికన్లు కాగా.. మరో 8 లక్షల మంది ఎల్‌సాల్వడార్‌ నుంచి వచ్చారని పేర్కొన్నది. అలానే 2021 నాటికి 7.25 లక్షల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం అమెరికాకు అక్రమంగా వలస వెళ్లిన వారిలో మొదటి స్థానంలో మెక్సికో ఉండగా.. రెండో స్థానంలో ఎల్‌సాల్వడార్‌ నిలవగా.. మూడో స్థానంలో భారత్‌ ఉండడం గమనార్హం.

ఎందుకింత దిగాజరుతున్నారు..
అమెరికాకు వెళ్లేందుకు తహతహలాడేవారి సంఖ్య ఏటా పెరుగోతంది. తమ పిల్లలు అమెరికాలో సెటిల్‌ అయ్యారంటే.. దానిని తల్లిదండ్రులు గొప్ప క్రెడిట్‌గా భావిస్తున్నారు. అందుకే సక్రమమా, అక్రమమా అని ఆలోచించకుండా అమెరిక ఫ్లైట్‌ ఎక్కించేస్తున్నారు. మరో కారణం ఏంటంటే.. ఇక్కడ సంపాదన తక్కువగా ఉంటుందని, అమెరికా వెళ్తే భారీగా సంపాదించవచ్చని యువతలో ఉన్న అభిప్రాయం. అక్కడ ఏం పనిచేస్తున్నామన్నది ముఖ్యం కాదని డబ్బు సంపాదనే ప్రధానం అన్నట్లుగా చదువుకున్నవారు కూడా ఇలా చట్ట విరుద్ధంగా వెళ్లిపోతున్నారు. ఇది నిజంగా భారత్‌కు ఓ మచ్చే.