https://oktelugu.com/

Car Driving On Hill: నీ డ్రైవింగ్ కు దండం రా స్వామి.. షేక్ చేస్తోన్న వీడియో

సాధారణంగా మనం వాహనం నడుపుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటాం. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్, కారు తోలుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. కానీ ఇతగాడు ఆ జాగ్రత్తలు పాటించాడో లేదు తెలియదు గానీ కారు నడిపేటప్పుడు మాత్రం పరధ్యానంలో ఉన్నట్టున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 24, 2023 / 01:05 PM IST

    Car Driving On Hil

    Follow us on

    Car Driving On Hill చెట్టులెక్కగలవా, పుట్టలెక్కగలవా అని వెనుకటికి ఓ తెలుగు సినిమాలో హీరోను ఆటపట్టిస్తూ హీరోయిన్ పాట పాడుతుంది. కానీ ఇతగాడు ఆ హీరోయిన్ మాదిరే తన కారుతో డ్యూయెట్ పాడినట్టున్నాడు. అందుకే అది వక్ర మార్గం పట్టింది. అందులోనూ ఓ ఎత్తయిన పర్వతానికి వెళ్లే దారిలో అడ్డదిడ్డంగా ఒదిగిపోయింది. ఇక దాన్ని కిందికి దించేందుకు ఆ వాహన యజమాని పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.

    అలా ఎలా జరిగింది

    సాధారణంగా మనం వాహనం నడుపుతున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉంటాం. బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్, కారు తోలుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. కానీ ఇతగాడు ఆ జాగ్రత్తలు పాటించాడో లేదు తెలియదు గానీ కారు నడిపేటప్పుడు మాత్రం పరధ్యానంలో ఉన్నట్టున్నాడు. కనీసం కారు ఎటు వెళ్తుందో అనే సోయి కూడా లేకుండా నడిపాడు. ఫలితంగా తిన్నగా పోవలసిన కారు అడ్డగోలుగా ఓ కొండకు వెళ్లే దారిలో వెళ్ళిపోయింది. పైగా అడ్డదిడ్డంగా ఆగిపోయింది. దానిని సక్రమార్గంలో పెట్టేందుకు ఆ వాహన యజమాని నరకం చూశాడు.

    కారేనా అది

    సాధారణంగా మనం ద్విచక్ర వాహనంతో విన్యాసాలు చేసేవారిని చూసి ఉంటాం. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న వీడియోలో మాత్రం ఆ వ్యక్తి కారు తో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. దానిని ముందుకు వెనక్కి తిప్పుతూ కారును ఒక సక్రమమైన మార్గంలో నడిపించేందుకు తనకు వచ్చిన విద్యలు మొత్తం ప్రదర్శించాడు.. చూస్తుంటే కామెడీగానే ఉంది కానీ అతగాడి డ్రైవింగ్ టెక్నిక్ చూస్తే మాత్రం ఫిదా అవకుండా ఉండలేం. ఎందుకంటే కారును అత్యంత జాగ్రత్తగా వెనక్కి పడకుండా చూసుకోవడం అంటే మాటలు కాదు. స్టీరింగ్ తిప్పే సమయంలోనూ అతడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు.. ఇప్పటికే ఈ వీడియో 19 మిలియన్ వ్యూస్ దాటింది. పైగా ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఫీట్స్ చేయాలంటే ఎంతో తెగువ కావాలి. దాన్ని ప్రదర్శించేందుకు ఎన్ని కార్లు ధ్వంసమయ్యాయో అని కొందరు కామెంట్ చేస్తుంటే.. గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఈ వాహనం పనిచేస్తుండడం ఆశ్చర్యంగా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు..