https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవిని నమ్మించి మోసం చేసిన ఆ సీనియర్ నటుడు ఎవరో తెలుసా..?

చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఎవర్ని అడిగితే అవకాశాలు వస్తాయో తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక ఫుట్ పాత్ మీద కూడా చాలా రోజులు పడుకొని తన లైఫ్ ని తనకు తానే చెక్కుకొని మెగాస్టార్ గా ఎదిగాడు.

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2023 / 01:17 PM IST

    Megastar Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అమితమైన ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన సోలోగా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన తీరును చూసిన ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీ కి రావాలని కోరుకోని కొందరు వచ్చి సక్సెస్ కూడా అయ్యారు అలాగే ఇండస్ట్రీ అనే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నవారు కూడా చిరంజీవి సాధించిన సక్సెస్ లను స్ఫూర్తి గా తీసుకొని వాళ్ల రంగం కి రాణించి విజయం సాధించాలనేంత స్ఫూర్తినిచ్చిన చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి చాలా అభిమానంతో పాటు గౌరవం కూడా ఉంటుంది.

    చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఎవర్ని అడిగితే అవకాశాలు వస్తాయో తెలియక, ఎక్కడ ఉండాలో తెలియక ఫుట్ పాత్ మీద కూడా చాలా రోజులు పడుకొని తన లైఫ్ ని తనకు తానే చెక్కుకొని మెగాస్టార్ గా ఎదిగాడు. ఈయన నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అవడమే కాకుండా వరుసగా ఆరు సంవత్సరాలు ఆరు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన హీరోగా చిరంజీవి పేరు మీద ఒక అరుదైన రికార్డు అనేది క్రియేట్ అయింది.

    ఇక ఇప్పుడు కూడా తనదైన రీతిలో వరుస సినిమాలతో 100 కోట్ల కలక్షన్లను రాబడుతున్న హీరోగా నిలిచాడు.ఇక ఇది ఇలా చిరంజీవి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక పెద్ద నటుడు తనకి సినిమాలో అవకాశం ఇప్పిస్తాను అని చెప్పి తీరా సమయానికి అవకాశం వేరే వాళ్లకు ఇచ్చి తనని తీవ్రంగా నిరాశపర్చాడు అంటూ చిరంజీవి అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఆ నటుడు ఎవరు అనేది ఆయన బయటపెట్టనప్పటికీ ఆయన కూడా ఇండస్ట్రీలో చాలా పెద్ద నటుడు అనే విషయం అయితే చిరంజీవి చెప్పడం జరిగింది.ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న చిరంజీవి తను అనుకున్న గమ్యాన్ని చేరుకోగలిగాడు. అందుకే చిరంజీవి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు మనం అనుకున్న లక్ష్యం గోప్పదైతే దానికోసం మనం ఎంత ఎఫర్ట్ అయితే పెట్టగలమో అంత ఎఫర్ట్ పెట్టి ముందుకు సాగడం ఒక్కటే మనం చేయాల్సిన పని…

    ఇక అన్ని కాలమే చూసుకుంటుంది అంటూ చెప్తాడు.ఇక చిరంజీవి తను పొందిన విజయాన్ని మిగతా నలుగురు పంచుతూ వాళ్లు కూడా పైకి ఎదగాలనే ఉద్దేశ్యం తో కోరుకుంటుంటారు కాబట్టి చిరంజీవి ఎప్పటికీ ఇండస్ట్రీలో అందరి చేత కీర్తింపబడుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద షూటింగ్ జరుపుకుంటుంది… ఇక ప్రస్తుతం చిరంజీవి ఈ సినిమా మీదనే తన పూర్తి ఎఫర్ట్ పెట్టినట్టు గా తెలుస్తుంది…