https://oktelugu.com/

Forest : అడవిలోకి నాలుగేళ్ల పాప.. ఎన్ని రోజులు ఉందో తెలుసా..? అసలెలా బతికిందంటే..?

ఈ ఘటనపై తాజాగా చిన్నారి అమ్మమ్మ కాన్స్ వెల్లా స్పందించారు. పిల్లలిద్దరూ కొంతకాలంగా తనవద్దే ఉంటున్నట్లు చెప్పారు. పిల్లల తల్లి, తన కూతురైన ఆలియా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అయితే తన కు చెప్పకుండానే పిల్లలను ఆలయా తీసుకెళ్లిందని, ఆ తర్వాత తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని పేర్కొంది

Written By:
  • NARESH
  • , Updated On : July 16, 2024 / 02:24 PM IST

    Chaild

    Follow us on

    Forest :  భూమి మీద నూకలు రాసుంటే ఎట్లైనా బతికేస్తామని పెద్దలు చెప్పిన మాట అచ్చంగా నిజమైంది. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన చిన్నారి రెండు రోజుల పాటు అడవిలో ఉండిపోయింది. చివరికి ఎలాగోలా దొరికిపోయింది. చిన్నారి కోసం అహర్నిశలు వెతికిన పోలీస్, అధికార యంత్రాంగం, కుటుంబ సభ్యులకు చిన్నారి కనిపించడంలో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆచిన్నారి సోదరుడు మాత్రం స్థానిక చెరువులో విగతజీవిగా కనిపించాడు.

    రెండు రోజుల పాటు అడవిలో ఆ చిన్నారి తిండి, నీరు లేకుండా తిరిగి సజీవంగా దొరకడం నిజంగా అద్భుతమని మీడియా అభివర్ణించింది. కాగా చిన్నారులు తప్పిపోయినట్లు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే నెపంతో తల్లి ఆలియా జాక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మిసిస్సిపీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తల్లి మెరిడియన్ ఖైదీగా ఉంది. ఆమె పైనే ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనకు కారణంగా పలువురు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓ చిన్నారి అడవిలో సజీవంగా లభించడం పైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

    అసలేం జరిగిందంటే..
    ఈ ఘటనపై తాజాగా చిన్నారి అమ్మమ్మ కాన్స్ వెల్లా స్పందించారు. పిల్లలిద్దరూ కొంతకాలంగా తనవద్దే ఉంటున్నట్లు చెప్పారు. పిల్లల తల్లి, తన కూతురైన ఆలియా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అయితే తన కు చెప్పకుండానే పిల్లలను ఆలయా తీసుకెళ్లిందని, ఆ తర్వాత తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని పేర్కొంది. ఇక ఒక రోజు చిట్టడివిలో కారు నిలిపి ఒక ఫోటోను తనతో షేర్ చేసుకుందని తెలిపింది. అప్పటినుంచి తన మనుమళ్లపై ఆరా తీసినా చెప్పలేదని, తనకు కొంత భయం ఉందని చెప్పింది. అయితే ఇటీవలే తన తల్లి చనిపోయిందని, ఇప్పుడు ఒక మనుమడి మృతదేహం చెరువులో లభించడం తనను మరింత ఆవేదనకు లోను చేసిందని పేర్కొంది.

    అయితే, రెండు రోజుల క్రితం తన పెద్ద మనుమడి మృతదేహం చెరువులో దొరికినట్లు సమాచారం అందిందని, అప్పటి నుంచి చిన్న మనుమడి ఆచూకీపై తీవ్ర గందరగోళం నెలకొందని తెలిపింది. ఇక ఆలియా మానసిక పరిస్థితిపై కూడా తాను ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు కారణాలు తనకు తెలియవని, తన వద్ద ఉన్న పిల్లలను తీసుకెళ్లి ఇలాంటి ఘటనకు పాల్పడుతుందని తాను అనుకోలేదని చెప్పింది. పెద్ద మనుమడు లెజెండ్ మృతదేహాన్ని చూసిన కాన్స్ వెల్లా తీవ్రంగా రోదించింది. చిన్న మనుమడి ఆచూకీపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తన చిన్న మనుమడిని వెంటనే సంరక్షించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని కోరింది. దీంతో వెంటనే వారు గాలింపు చర్యలు చేపట్టారు.

    తల్లిపై పలు అభియోగాలు
    పిల్లలు చిట్టడివిలో వదిలేసింది తల్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను మిస్సిస్సిప్పిలోని రైల్వే స్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె ప్రస్తుతం స్థానిక మెరిడియన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఆమెపై మరిన్ని అభియోగాలు కూడా నమోదైనట్లు స్థానిక పోలీసులు ఉటంకించారు. అయితే బాలుడి మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. మరో బాలుడు అటవీ ప్రాంతంలో ఓ ట్రక్కు డ్రైవర్ కు దొరకడంతో ఈ అదృశ్యం మిస్టరీ వీడిందని చెప్పారు. టెక్సాస్ లూసియానా సరిహద్దులోని హైవేపై గుంతలో ఈ చిన్నారి కనిపించినట్లుగా వారు వెల్లడించారు. అయితే దర్యాప్తు కొనసాగుతున్నదని పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. పెద్ద పిల్లాడి కి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.