https://oktelugu.com/

Bank of Baroda : బ్యాంకింగ్ రంగంలో FD సంచలనం.., అన్ని బ్యాంకులకు షాక్ ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడాలో మారిన రేట్ల ప్రకారం 15 రోజుల నుంచి 45రోజుల కాల పరిమితి ఉన్న దేశీయ టర్మ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లించబోతున్నది. దీంతో పాటు తక్కువ కాల పరిమితి( 7 నుంచి 14 రోజుల) ఎఫ్డీలపై 4.25 శాతం వడ్డీ చెల్లించబోతున్నది. ఇక 46 నుంచి 90 రోజుల వరకు 5.50శాతం, 91 నుంచి 180 రోజుల వరకు 5.60 శాతం, 181 నుంచి 210 రోజుల వరకు 5.75 శాతం, 211 నుంచి 275 వరకు 6.15 శాతం వడ్డీ రేటు అందించబోతున్నది

Written By:
  • NARESH
  • , Updated On : July 16, 2024 / 02:38 PM IST
    Follow us on

    Bank of Baroda :  బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్ డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. సోమవారం నుంచే వీటిని అమలు చేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. రూ. 3 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీరేటును ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు పెంచింది. దీంతో పాటు మాన్ సూన్ ధమాకా పేరిటా డిపాజిట్ స్కీమ్ ను కూడా ప్రారంభించింది. అయితే దీనికి వరుసగా 399 రోజులు, 333 రోజుల ప్యాకేజీని ప్రకటించింది. దీంతో పాటు సాధారణ ప్రజలకు 7.25శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం నాన్ సీనియర్ సీటిజన్లకు 7.15 శాతం ఎఫ్డీ రేట్లు అమల్లోకి తెస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. సోమవారం నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది. కొత్త వడ్డీ రేట్ల వివరాలను అందులో పొందుపర్చింది. ప్రస్తుతం ఉన్న వాటి కంటే భిన్నంగా ఈ రేట్లను బ్యాంక్ ప్రకటించింది.

    తాజాగా మారిన రేట్ల ప్రకారం..
    బ్యాంక్ ఆఫ్ బరోడాలో మారిన రేట్ల ప్రకారం 15 రోజుల నుంచి 45రోజుల కాల పరిమితి ఉన్న దేశీయ టర్మ్ డిపాజిట్లపై 6 శాతం వడ్డీ చెల్లించబోతున్నది. దీంతో పాటు తక్కువ కాల పరిమితి( 7 నుంచి 14 రోజుల) ఎఫ్డీలపై 4.25 శాతం వడ్డీ చెల్లించబోతున్నది. ఇక 46 నుంచి 90 రోజుల వరకు 5.50శాతం, 91 నుంచి 180 రోజుల వరకు 5.60 శాతం, 181 నుంచి 210 రోజుల వరకు 5.75 శాతం, 211 నుంచి 275 వరకు 6.15 శాతం వడ్డీ రేటు అందించబోతున్నది. కాగా రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపైనే ఈ వడ్డీ రేటు వర్తించనుంది. ఇక 271 నుంచి ఏడాది కంటే తక్కువ ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.25శాతం వడ్డీ రేటును అందించబోతున్నది. ఇక కొత్తగాతెచ్చిన మాన్ సూన్ ధమాకా పథకం మరింత ఆకట్టుకునేలా ఉంది. దీనిపై వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంది. అయితే ఇది 333 రోజులపై వర్తించనుంది. కొత్తగా ప్రారంభించిన 399 రోజుల కాలపరిమితిపై ఈ స్కీమ్ లో 7.25 శాతం వడ్డీ లభించనుంది. అయితే రెండేళ్ల కంటే ఎక్కువగా, మూడేళ్ల కంటే తక్కువ కాలపరరిమితితో ఎఫ్డీ తీసుకున్న వారికి బ్యాంక్ 7.15 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. దీంతో పాటు మూడు , పదేళ్ల మెచ్యూరిటీ కాల పరిమితితో తీసుకుంటే 6.50శాతం వడ్డీ రేటును బీవోబీ చెల్లించనుంది. అయితే తాజా వడ్డీ రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఈ మేరకు వినియోగదారులు గమనించాలని బ్యాంక్ అధికారులు తెలిపారు.

    బ్యాంక్ అధికారుల స్పందన..
    తాజాగా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ మదలియార్ మాట్లాడుతూ మాన్ సూన్ ధమాకా పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఖాతాదారులు తమ పొదుపపై అధిక వడ్డీని పొందే వీలు ఈ స్కీమ్ ద్వారా కలిగిందని చెప్పారు. ఖాతాదారులకు ఇది విలువైన సమయం. అధిక రాబడిని పొందేందుకు ఈ స్కీమ్ ను ఎంచుకునే వీలుంది. బ్యాంకింగ్ రంగంలో సురక్షిత హామీలకు బీవోబీ అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ బీవోబీ ప్రస్తుతం గత నెల 30 నాటికి తన మార్కెట్ 23.77 ట్రిలియన్లకు విస్తరించింది. బ్యాంక్ గ్లోబల్ అడ్వాన్స్ లు ఏడాదికి 8.14 శాతం పెరిగి 10.72 ట్రిలియన్లు నమోదు చేసుకున్నాయి.