Homeఆంధ్రప్రదేశ్‌Assistant Commissioner Shanti : దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చుట్టూ బిగిస్తున్న...

Assistant Commissioner Shanti : దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. విజయసాయి అండతో భారీ అవినీతి.. తేలితే డిస్మిస్

Assistant Commissioner Shanti  :  విజయసాయి రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం పై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా విశాఖలో దేవాదాయ శాఖను అడ్డం పెట్టుకొని జరిగిన భూ దందాపై బలమైన చర్చ నడుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్లీడర్ గా పనిచేసిన సుభాష్ రెడ్డిలతో ఆమె చేసిన వ్యవహారాలు ఆరా తీసే పనిలో పడింది ప్రభుత్వం. ముఖ్యంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంశాలు బయటపడుతున్నాయి. సహాయ కమిషనర్ గా చిన్న ట్రంకు పెట్టితో విశాఖ వచ్చిన ఆమె కోట్ల రూపాయల ఆస్తులతో బదిలీపై వెళ్లారని.. దేవాదాయ శాఖ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం జరుగుతోంది.ఆమె అవినీతి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
 శాంతి ఒక సాధారణ వాచ్ మెన్ కుమార్తె. దేవాదాయ శాఖ సమీక్ష సమావేశాల్లో తన వద్ద 100 కాసుల బంగారం ఉందని చూపించేందుకు ఆమె తాపత్రయపడేవారని దేవాదాయ శాఖలో ఒక ప్రచారం అయితే ఉంది. తాను దేవాదాయ శాఖలోకి వచ్చిన తర్వాత సంపాదించింది కాదు.. తనది సంపూర్ణమైన కుటుంబం అంటూ చెప్పుకొచ్చేవారని తెలుస్తోంది. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అవినీతి ఇన్స్పెక్టర్  ను కలెక్షన్ ఏజెంట్ గా నియమించుకుని దందా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో హారం, కాసుల పేరుతో శాంతి వెళ్లేవారు అని అప్పట్లో విశాఖలో ప్రచారం అయితే ఉంది. విశాఖ సాగర్ నగర్ లో 60 లక్షల రూపాయల విలువ చేసి ఇంటిని కూడా ఆమె కొనుగోలు చేశారు.
 ప్రేమ సమాజం భూముల వ్యవహారంలో చాలా వేగంగా స్పందించారు శాంతి. ఆ భూముల లీజు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా పరిణామాలు జరిగాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. నాడు ఆ భూములపై కన్నేసిన విజయసాయిరెడ్డి పావులు కదపడం ప్రారంభించారు. ఆ భూముల వివరాలు కావాలంటూ దేవాదాయ శాఖను ఆదేశించిన మరుక్షణం.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి తన పని మొదలుపెట్టారు. విజయ సాయి ఆదేశాలను వేగవంతంగా అమలు చేశారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందిన సాయి ప్రియ రిసార్ట్స్ భూమిని.. దేవాదాయ శాఖ నుంచి తప్పించేందుకు భారీ స్కెచ్ వేశారు. అప్పుడే విజయసాయిరెడ్డి తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగిందని తెలుస్తోంది.  అయితే ఆమె ఉత్తరాంధ్రలో మరో అధికార కేంద్రంగా మారారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు విజయసాయిరెడ్డి ద్వారా చేయించుకున్నారన్న  విమర్శలు కూడా ఉన్నాయి.
 విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కుటుంబాన్ని సైతం.. అమాంతం వాడేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆనంద్  లంకెలపాలెం పరదేశమ్మ అమ్మవారి ఆలయ స్థలములో రాయల్ లైన్ ఐస్ క్రీమ్స్  పేరిట వ్యాపారాన్ని ప్రారంభించారు. వాస్తవానికి దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలకు మించి లీజు ఇవ్వడం కుదరదు. అయితే శాంతి నిబంధనలకు విరుద్ధంగా మొత్తం స్థలాన్ని  కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో పరిచయమైన అడారి ఆనంద్ వదినకు దగ్గరయ్యారు శాంతి. ఆమెను బుట్టలో వేసుకుని.. దోష నివారణ పూజల పేరిట విమానాల్లో దేశమంతా కలియతిరి గారు. శాఖా పరమైన నిబంధనలు కనీసం పాటించలేదన్న విమర్శ ఉంది.
 శాంతి వ్యవహారాలు రచ్చకెక్కడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేవాదాయ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలపై వివరాలు రాబడుతోంది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి హయాంలో జరిగిన దేవాలయ భూముల లీజులు, అద్దె చెల్లింపులు, ఉండి ఆదాయంలో ఆరోపణల వంటి వాటిపై వివరాలు రాబట్టే పనిలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పటికే ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ అవకతవకలు నిజమని తేలితే ప్రభుత్వం డిస్మిస్ చేసే అవకాశం కనిపిస్తోంది.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version