Homeఅంతర్జాతీయంUS Presidential Elections: మారుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీకరణలు.. వేగంగా మారుతున్న అభ్యర్థుల గెలుపు...

US Presidential Elections: మారుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీకరణలు.. వేగంగా మారుతున్న అభ్యర్థుల గెలుపు అవకాశాలు!

US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు కూడా ప్రచారం ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీలు అయిన అధికార డెమొక్రటిక్‌ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలో నిలిచారు. ఇద్దరూ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల నిధుల సమీకరణతోపాటు, మద్దతు కోసం సంఘాలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలపై అమెరికాలోని పలు సంస్థలు సర్వే చేస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు నెల క్రితం వరకు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నాయి. మారుతున్న పరిణామాలు.. ట్రంప్‌ గెలుపు అవకాశాలను తగ్గిస్తున్నాయి. అధికార పార్టీని మరోసారి గెలిపించేలా మారుతున్నాయి. వేగంగా మారుతున్న పరిణామాలతో మొన్నటి వరకు గెలుపుపై ధీమాతో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో వైపు అధికార పార్టీ అభ్యర్థి నల్ల జాతీయురాలు కావడంతో ఆమెపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయొద్దని తమ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌కు సూచించింది. మరోవైపు కమలా హ్యారిస్‌పై గెలుపు ఈజీ అని నిన్నటి వరకు చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు గెలుపు కోసం మరింత శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది.

మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క..
తెలుగు సినిమాలో డైలాగ్‌ నిన్నటి వరకు ఒకలెక్క.. ఇవ్వాలటి నుంచి ఒక లెక్క అన్నట్లు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉన్న సమయంలో ఆ పార్టీ గెలుపు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆయన బరి నుంచి తప్పుకుని కమలా హ్యారిస్‌ రేసులోకి వచ్చాక పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బైడెన్‌ ఉన్నప్పుడు.. బైడెన్‌ తపుపకున్న తర్వాత అన్నట్లుగా డెమొక్రటిక్‌ పార్టీ గెలుపు అవకాశాలను వేగంగా మెరుగుపర్చుకుంటోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. అప్పలిలోగా సమీకరణలు ఇంకా మారొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తగ్గుతున్న ట్రంప్‌ బలం..
ప్రపంచంలోనే అతిపెద్ద అంచనా మార్కెట్‌ పోలీ మార్కెట్‌ ప్రకారం.. డోనాల్డ్‌ ట్రంప్‌ విజయావకాశాలు 2024 జూలై 16 వరకు 72 శాతం ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది 55% కి పడిపోయింది. ఇక డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ ఉన్న సమయంలో గెలుపు అవకాశాలు 28 శాత ఉండగా, కమలా హ్యారిస్‌ రాకపతో గెలుపు అవకాశాలు 43 శాతానికి పెరిగాయి. కమలా హ్యారిస్‌ అభ్యర్థి కావడం ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రజల్లో కూడా మద్దతు పెరిగింది. బైడెన్‌ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో ఆయనకు మద్దతుగా నిలిచేందకు అమెరికన్లు ఆసక్తి చూపలేదు. ప్రారంభంలో బలహీనమైన ప్రత్యర్థిగా కనిపించిన కమలా హారిస్‌ పోటీని మరింత పోటీగా మార్చారు,

జాతి గుర్తింపుపై విమర్శలు..
ఇక ట్రంప్‌ తన నోటి దురుసుతో మద్దతు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బ్లాక్‌ జర్నలిస్ట్‌ల పమావేశంలో హ్యారిస్‌ జాతి గుర్తింపుపై విమర్శలు చేశారు. మరోవైపు ట్రంప్‌ ప్రవర్తన కొన్ని రోజులుగా మారుతోంది. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి మార్పుతో ఆయనలో అసహనం పెరుగుతోంది. మరోవైపు అతని పాలనను అమెరికన్ను ఇప్పటికే చూశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఓటు వేయడానికి మెజారిటీ ప్రజలు సుముఖంగా లేరు. అయితే ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో కాల్పుల ఘటన తర్వాత ఆయనకు మద్దతు పెరిగింది. కానీ, కమలా హ్యారిస్‌ రాక ఆ మద్దతుకు క్రమంగా గండి కొడుతోంది. ఇకరిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ తీరు కూడా ఆ పార్టీకి ఇబ్బందిగా మరుతోంది.

హ్యారిస్‌కు భారతీయుల మద్దతు..
ఇక కమలా హ్యారిస్‌కు భారతీయ మూలాలు ఉండడంతో భారతీయ అమెరికన్లున ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. భారత ప్రభుత్వం కూడా కమలాకే మద్దతు తెలుపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఉపాధ్యక్షురాలిగా కమలా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. దీంతో ఎన్నికల్లో ఆమెకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బైడెన్‌ కూడా మిత్ర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాల మద్దతు కూడా డెమొక్రటిక్‌ అభ్యర్థికే ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో జరిగే పరిణామాలే అమెరికా అధ్యక్షులు ఎవరనేది తేలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version