https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ తో పెళ్లి… స్టార్ హీరోయిన్ కామెంట్స్ కి అందరూ షాక్!

ప్రభాస్ తో నాకు పెళ్లి చేశారని అంటుంది ఓ స్టార్ హీరోయిన్. అది నిజమైతే బాగుందని క్రేజీ కామెంట్స్ చేసింది. హైదరాబాద్ వేదికగా జరిగిన 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ ఈవెంట్లో పాల్గొన్న సదరు హీరోయిన్ ఈ విధంగా స్పందించారు. ఆ కథేమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 6, 2024 / 12:34 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: ప్రభాస్ పెళ్లి మీద తరచుగా రూమర్స్ వస్తుంటాయి. అనుష్క శెట్టి, ప్రభాస్ ఎఫైర్ లో ఉన్నారని చాలా కాలంగా వాదన ఉంది. ప్రభాస్ తో అనుష్క నాలుగు సినిమాలు చేసింది. బాహుబలి సమయంలో వీరి పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి. బాహుబలి 2 విడుదల తర్వాత పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను అనుష్క, ప్రభాస్ ఖండించారు. మేము మిత్రులం మాత్రమే. అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినప్పటికీ ప్రభాస్-అనుష్క పెళ్లి పై కథనాలు వస్తూనే ఉంటాయి.

    అలాగే కృతి సనన్ తో ప్రభాస్ ఆదిపురుష్ మూవీ చేశారు. ఆదిపురుష్ మూవీ సెట్స్ లో కృతి సనన్-ప్రభాస్ ప్రేమలో పడ్డారంటూ పుకార్లు లేచాయి. ఓ కార్యక్రమంలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. కృతి సనన్ లవర్ హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నాడని వరుణ్ ధావన్ అన్నాడు. దాంతో వరుణ్ ధావన్ చెప్పిన ఆ హీరో ప్రభాస్ అంటూ వార్తలు వెలువడ్డాయి.

    మాల్దీవ్స్ లో పెళ్లి అని కూడా కథనాలు రాసుకొచ్చారు. ఈ వార్తలను కృతి సనన్ ఖండించింది. ఇదిలా ఉంటే గతంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో ప్రభాస్ కి పెళ్లి జరిగిందని ప్రచారం చేశారు. ఈ వార్తలపై పాయల్ రాజ్ పుత్ తాజాగా స్పందించారు. హైదరాబాద్ వేదికగా 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి పాయల్ రాజ్ పుత్ హాజరైంది. మీపై ప్రచారమైన ఒక గాసిప్ గురించి చెప్పాలని ఆమెను ఓ మీడియా ప్రతినిధి అడిగారు.

    నాకు ప్రభాస్ కి పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. అవి చదివి నేను బాగా నవ్వుకున్నాను. ఆ వార్త నిజమైతే బాగుండు అనుకున్నాను, అని పాయల్ రాజ్ పుత్ నవ్వేసింది. మరి ప్రభాస్ వంటి స్టార్ హీరో, హ్యాండ్సమ్ ఫెలో భర్తగా వస్తే ఎవరు మాత్రం వద్దంటారు. అందుకే పాయల్ రాజ్ పుత్ ఆయనతో పెళ్లి జరిగిందన్న పుకారు నిజమైతే బాగుండు అని తన మనసులో మాట బయటపెట్టింది.

    కాగా చాలా కాలంగా పాయల్ రాజ్ పుత్ సౌరబ్ దింగ్రా అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. అతనితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. గతంలో ఆమె సీరియల్స్ లో నటించింది. ఆర్ ఎక్స్ 100 భారీ విజయం సాధించడంతో పాయల్ టాలీవుడ్ లో నిలదొక్కుకుంది.

    అయితే ఆశించిన స్థాయిలో పాయల్ రాజ్ పుత్ సక్సెస్ కాలేదు. ఆమెకు సక్సెస్ రేట్ లేదు. పాయల్ కి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రాలేదు. వెంకటేష్, రవితేజ వంటి హీరోల పక్కన ఛాన్స్ వచ్చినా… ఆ చిత్రాలు ఆడలేదు. దాంతో పాయల్ రాజ్ పుత్ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. ఆర్ ఎక్స్ 100 మూవీ విజయం సాధించినప్పటికీ బోల్డ్ ఇమేజ్ రావడం కూడా ఆమెకు మైనస్ అయ్యింది.