https://oktelugu.com/

Trekking : 22 ఏళ్ల క్రితం మంచు కొండల పైకి ట్రెక్కింగ్ వెళ్లి కనిపించకుండా పోయాడు.. ప్రస్తుతం అతన్ని చూసి అంతా షాక్..

ఇన్ని రోజులపాటు మంచు దట్టంగా కురవడం వల్ల విలియం మృతదేహం కుళ్ళి పోలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా హుస్కరన్ పర్వతంపై ఉష్ణోగ్రత - డిగ్రీలలో ఉంటుంది కాబట్టి, బ్యాక్టీరియా, వైరస్ ఆ ప్రాంతంలో ఉండే అవకాశం లేదని వివరిస్తున్నారు. అందువల్లే విలియం మృతదేహం పాడవలేదని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2024 / 10:11 PM IST

    William Stamp Dead Country

    Follow us on

    Trekking : అతని పేరు విలియం స్టాంప్ .. స్వస్థలం అమెరికా. ట్రెక్కింగ్ చేయడం అతడికి ఉన్న ప్రధానమైన హాబీ. అమెరికా వ్యాప్తంగా ఉన్న పర్వతాలను అతడు అధిరోహించాడు. పర్వతారోహకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. మంచు, మట్టి, దట్టమైన అడవి.. ఇలా అన్ని రకాల శిఖరాలను అధిరోహించి సరికొత్త రికార్డును సృష్టించాడు. అలాంటి విలియం దక్షిణ అమెరికా ఖండంలోని  పెరూ దేశంలో ఉన్న హుస్కరన్ అనే మంచు పర్వతం ఎక్కేందుకు వెళ్లాడు. ఆ తర్వాత అతడు అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారు అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. అయినప్పటికీ అతడి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబ సభ్యులు కూడా వెతికీ వెతికీ ఆశ వదిలేసుకున్నారు.

    2002లో హుస్కరన్ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లిన విలియం.. ఎంతకూ రాకపోవడంతో చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. దాదాపు 22 సంవత్సరాలు గడిచిన తర్వాత అతడి ఆచూకీ లభ్యమైంది. అయితే అతడు దొరికింది సజీవంగా కాదు.. అతడి మృతదేహం హుస్కరన్ మంచు పర్వతంలో లభ్యమైంది. అతడి మృతదేహం పై మంచు దట్టంగా పేరుకుపోయింది. ఫలితంగా విలియం ఒంటిపై ఉన్న దుస్తులు ఏమాత్రం చెక్కుచెదరలేదు. బూట్లు అలాగే ఉన్నాయి.. చివరికి పాస్ పోర్ట్ కూడా అలాగే ఉంది. ఈ విషయాన్ని అక్కడి పర్వతారోహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విలియం మృతదేహం వద్ద లభ్యమైన ఆధారాల ప్రకారం పోలీసులు ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి.. అసలు విషయం చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు వచ్చి విలియం మృతదేహాన్ని తీసుకెళ్లారు.

    ఇన్ని రోజులపాటు మంచు దట్టంగా కురవడం వల్ల విలియం మృతదేహం కుళ్ళి పోలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా హుస్కరన్ పర్వతంపై ఉష్ణోగ్రత – డిగ్రీలలో ఉంటుంది కాబట్టి, బ్యాక్టీరియా, వైరస్ ఆ ప్రాంతంలో ఉండే అవకాశం లేదని వివరిస్తున్నారు. అందువల్లే విలియం మృతదేహం పాడవలేదని అంటున్నారు. “విలియం జ్ఞాపకాలలో ఇన్నాళ్లు బతికాం. అతడి జాడ కోసం చాలా ఏళ్లు తిరిగాం. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక అతడు మాకు ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోయాడు. చివరికి ఇన్నాళ్లకు దేవుడు మా మొర ఆలకించినట్టు ఉన్నాడు. అందుకే అతడి చివరి చూపును మాకు దక్కించాడు. విలియం ను ఇక చూడలేం అనుకుంటున్న సమయంలో.. అతడి మృతదేహాన్ని మాకు అందేలా చేశాడని” అతని కుటుంబ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.