Homeఅంతర్జాతీయంIran new war strategy: యుద్ధ వ్యూహం మార్చిన ఇరాన్‌.. విస్తరణకు సరికొత్త ప్లాన్‌!

Iran new war strategy: యుద్ధ వ్యూహం మార్చిన ఇరాన్‌.. విస్తరణకు సరికొత్త ప్లాన్‌!

Iran new war strategy: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో ఇరాన్‌ క్షిపణి వ్యవస్థలు, అణు కేంద్రాలు లక్ష్యాలుగా మారాయి. మరోవైపు ఇరాన్‌ ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలు, ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. తాజాగా యుద్ధ వ్యూహం మార్చింది. తుర్కియేపై కూడా బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించింది. నాటో డిఫెన్స్‌ వ్యవస్థ ఆ దాడిని అడ్డుకున్నప్పటికీ, ఇది యుద్ధాన్ని విస్తరించే సంకేతాలు వెలువడుతున్నాయి.

దాడి ఉద్దేశం..
తుర్కియే నాటోలో రెండో బలవంతమైన సభ్యుడిగా, అమెరికా మిత్రదేశంగా ఉన్నందున దానిపై దాడి ఇరాన్‌ వ్యూహాత్మక ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తోంది. ఇది నాటో ఐదవ ఆర్టికల్‌ను ఆకర్షించి అమెరికాకు భారాన్ని పెంచుతుంది. ఇరాన్‌ ఇస్లామిక్‌ గుర్తింపును ఉపయోగించి ప్రాంతీయ చీలికలు తీసుకురావాలని చూస్తోంది.

యుద్ధ విస్తరణ వ్యూహం
ఇరాన్‌ అసిమెట్రిక్‌ పోరాటంతో యుద్ధాన్ని గల్ఫ్‌ దేశాలు, యూరప్‌ వరకు వ్యాప్తి చేస్తోంది. యూఏఈ, ఖతార్, బహ్రైన్‌లపై దాడులు అమెరికా మిత్రుల్లో చీలికలు తీసుకువచ్చి, వారి ప్రజల్లో అసంతృప్తి పెంచుతాయి. ఇది శత్రు కూటమి ఐక్యతను బలహీనపరుస్తుంది. ్ర

అమెరికాపై ఒత్తిడి పెంపు
అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలపై దాడులు ట్రంప్‌ యుద్ధ నీతికి అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికే ఆరుగురు అమెరికన్‌ సైనికుల మరణాలు అమెరికన్‌ అభిప్రాయాన్ని మలుపు తిప్పుతున్నాయి. ఇరాన్‌ దీని ద్వారా యుద్ధాన్ని సంక్షోభంగా మార్చి, అమెరికా ఉపసంహరణకు బలవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: ప్రపంచాన్ని నాశనం చేసే ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్.. ఎంత డేంజర్ అంటే?

ఆర్థిక ఒత్తిడి తేవాలని..
బర్మూజ్‌ జల సంధి మూసివేత, డ్రోన్‌ దాడులతో ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. సరుకు రవాణా నిలిచిపోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు. ఇరాన్‌ తాను నష్టపోవడంతోపాటు ప్రపంచ దేశాలు నష్టపోయేలా చేయాలని భావిస్తోంది. తద్వారా అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇది గందరగోళంతో శత్రువు ఓర్పును పరీక్షిస్తుంది.

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం సృష్టించడంతోపాటు యుద్ధ విస్తరణతో ఎక్కువ కాలం యుద్ధం జరగాలని చూస్తోంది. తద్వారా అమెరికాకు ఆర్థిక నష్టంతోపాటు ప్రపంచ దేశాల ఒత్తిడి పెరుగుతుంది. ఇదే సమయంలో అమెరికా మిత్రుల్లో భయం పెరుగుతుంది. ఆర్థిక నష్టాలు ప్రపంచాన్ని యుద్ధ వ్యతిరేక ఒత్తిడికి దోహదపడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version