Children’s Writing : పిల్లల రైటింగ్ చూసి ఏంట్రా ఇది అంటున్నారా? రైటింగ్ ను రైట్ చేసే సూపర్ టిప్స్

ఒత్తిడి: కొందరు తల్లిదండ్రులు పిల్లల రైటింగ్ బాగలేదని తిడుతుంటారు. ఎప్పుడు నేర్చుకుంటావు అంటూ ఒత్తిడి తెస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి ప్రతి రోజు రాయడం నేర్పించడం కోసం కాస్త సమయం కేటాయించండి. అప్పుడు వారికి ఒత్తిడి అనిపించదు.

Written By: NARESH, Updated On : July 9, 2024 10:18 pm

Super tips to improve children's writing

Follow us on

children’s writing : పిల్లలు ఎంత టాపర్స్ అయినా ఎంత చదివినా సరే కొందరి రైటింగ్ మాత్రం అసలు బాగుండదు. ఈ విషయంలో గుండ్రగా రాయురా, మంచిగా రాయురా అంటూ తిడుతుంటారు. అయినా లాభం ఉండదు. మరి పిల్లల రైటింగ్ బాగుండాలంటే ఏం చేయాలో ఓ సారి తెలుసుకుందాం. ఈ నాలుగు టిప్స్ పాటించండి. కచ్చితంగా వారి చేతి వ్రాత మారుతుంది.

పెన్నులు వద్దు పెన్సిల్లు బెటర్:
పిల్లలు ఏడిస్తే పెన్సిల్లు పక్కన పెట్టి పెన్నులు ఇస్తారు. కానీ పెన్నుల కంటే పెన్సిల్ తోటి రాస్తేనే చేతి వ్రాత బాగుంటుంది. పట్టుకోని ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి వారికి పట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది. అందుకే పెన్నుల కంటే పెన్సిల్లే ఉపయోగించాలి. పెన్సిల్ల వల్ల పేపర్స్ కూడా వేస్ట్ కావు. ఒకసారి రాసిన తర్వాత మళ్లీ తుడిపి రాయవచ్చు. అందంగా వచ్చే వరకు రఫ్ చేస్తూ నేర్చుకోవచ్చు. వేస్ట్ అవుతాయనే భయం కూడా ఉండదు.

పిండితో వ్రాత.. కొన్ని రకాల పిండిల వల్ల కూడా చేతి రాతను బాగా మార్చుకోవచ్చు. ఒక ప్లేట్లో బాగా పిండి పోసి పిల్లల చేతిని పట్టుకొని వారితో రాయించండి. ఇలా చేయడం వల్ల కూడా వారు రాయడం నేర్చుకుంటారు. అందంగా చేతిని పిండితో తిప్పడం లేదా పిండిలో రాయడం వంటివి చేయిస్తుండాలి.

ఒత్తిడి: కొందరు తల్లిదండ్రులు పిల్లల రైటింగ్ బాగలేదని తిడుతుంటారు. ఎప్పుడు నేర్చుకుంటావు అంటూ ఒత్తిడి తెస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి ప్రతి రోజు రాయడం నేర్పించడం కోసం కాస్త సమయం కేటాయించండి. అప్పుడు వారికి ఒత్తిడి అనిపించదు.

ప్రతి సారి పెన్సిల్ తో రాయాలంటే కూడా బోర్ గా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు క్రేయాన్లు లేదా కలర్ పెన్సిళ్లను ఇస్తుండాలి. అలాగే పేపర్స్ పై గీయమని, రంగులు వేయమని చెప్పడం వల్ల కూడా వారికి ఆసక్తి పెరుగుతుంది. ఇది అక్షరాలను గుండ్రంగా రాడయానికి సహాయం చేస్తుంది. అంతేకాదు అందంగా రాస్తే ఓ చిన్న గిఫ్ట్ ఇస్తామని కూడా అప్పుడప్పుడు చెప్పండి. ఫాస్ట్ గా వారే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.